'ఉద్యోగాల భర్తీలో చర్యలు ఏవి?'
హైదరాబాద్: రిజర్వేషన్లు లేకుండా ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాలుగో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. సభలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, లేకుంటే పాఠశాలలు మూతపడే ప్రమాదముందని ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. ఖాలీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏమైందని మోహన్ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి సభలో మాట్లాడారు.