ఇది నయవంచన బడ్జెట్ | ysrcp leaders comments on ap budget? | Sakshi
Sakshi News home page

ఇది నయవంచన బడ్జెట్

Published Fri, Mar 11 2016 2:20 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

ఇది నయవంచన బడ్జెట్ - Sakshi

ఇది నయవంచన బడ్జెట్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే లు విమర్శించారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలనూ మోసం చేశారని, అంకెలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు స్వామినాయుడు, కిలివేటి సంజీవయ్య, ఎక్కలదేవి ఐజయ్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడారు. ఏపీ బడ్జెట్‌లో అంకెలు పెరిగాయే తప్ప రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపేలా ఎక్కడా లేదన్నారు.

అమరావతి కట్టాలని పెద్ద బిల్డింగ్‌లు చూపిస్తున్న చంద్రబాబు.. బడ్జెట్‌లో దానికి కేటాయించిన నిధుల తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్యే  చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పి ఎలా అధికారంలోకి వచ్చారో.. అలాగే రైతులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, పేదలు అందరినీ మోసగించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు.ఇది పూర్తిగా కాకిలెక్కలతో కూడుకున్న బడ్జెట్ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement