మైనార్టీలకు విద్యా ప్రదాత వైఎస్సే | in ys rajasekhar reddy ruling muslims are in progressive | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు విద్యా ప్రదాత వైఎస్సే

Published Fri, Apr 4 2014 1:48 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

in ys rajasekhar reddy ruling muslims are in progressive

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లిం మైనార్టీల విద్యాప్రదాతగా వైఎస్సార్ ఘనత వహించారని వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పించి ఉన్నత చదువులకు సహకరించారన్నారు. ఆయన చేసిన మేలును ఎవరూ మరిచిపోలేరని, పార్టీ అభ్యర్థులను అఖండా మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు.
 
కర్నూలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన స్వీటి, రోస్, దావూద్ ఆధ్వర్యంలో నూర్‌జహాన్, ఫాతిమా, షాహిన్, షాహిదా, పర్విన్, జమీలా, హసీనా, ఫర్‌జానా, మస్తాన్‌బీ, మరో 150 మంది మైనారిటీ మహిళలు పార్టీలో చేరారు. 20వ వార్డు జోహరాపురానికి చెందిన ముర్తుజావలి ఆధ్వర్యంలో కె.నాగరాజు, రమణ, శ్రీరాములు, చరణ్, మార్క్, డేవిడ్, అలీ, నాగరాజు, రాఘవేంద్ర, మరో 150 మంది ఇందిరమ్మ గృహాలు పొందిన మహిళలు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.
 
పార్టీ మహిళా విభాగం సిటీ కన్వీనర్ ముంతాజ్, సమీర్, చాంద్, రఘు ఆధ్వర్యంలో 12, 14 వార్డులకు చెందిన సుమారు 100 మంది యువకులు పార్టీలో చేరారు. వీరందరూ నగరంలోని ఎస్వీ నివాసంలో గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఎస్వీ అన్నారు. కార్యక్రమంలో సయ్యద్ జహీర్‌బాషా,, అజర్, ఇర్ఫాన్, యాసిర్, జావీద్, కాశిక్, జాకీర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement