జగన్ నాయకత్వానికే జనం మొగ్గు | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

జగన్ నాయకత్వానికే జనం మొగ్గు

Published Mon, Mar 31 2014 11:58 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

peoples are looking for ys jagan ruling

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ ఆశయ సాధనకు పాటుపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికే జనం మొగ్గు చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహ న్‌రెడ్డి అన్నారు. జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపిస్తారని ధీమాగా చెప్పారు. నగరంలోని నాలుగు వార్డుల నుంచి సుమారు 300 మంది సోమవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
15వవార్డుకు చెందిన మగ్బూల్, ఇబ్రాహిం, ఇంతు, షఫి, మహబూబ్, సద్దాం, హనీఫ్ తదితర 110 మంది, 10వవార్డుకు చెందిన సలీం, అబ్దుల్లా, అప్సర్‌బాషా, ఇస్మాయిల్‌మియా, ఖాదర్‌బాషా, ఖాజాబాషా, ఫారుక్‌బాషా తదితర 50 మంది వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మహ్మద్‌గౌస్, మాలిక్‌బాషా ఆధ్వర్యంలో 7వవార్డుకు చెందిన 60 మంది యువకులు, మహబూబ్‌పాషా, ఖలీల్, జహీర్ ఆధ్వర్యంలో 12వ వార్డుకు చెందిన 50 మంది మహిళలు, 30 మంది యువకులు పార్టీలో చేరారు.
 
వీరంతా నగరంలోని ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసంలో సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎస్వీ మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను రూపొందించగా తండ్రికి తగ్గ తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మెనిఫెస్టోను రూపొందించారని తెలిపారు.  అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మేనిఫెస్టో అమలు కోసం చర్యలు తీసుకుంటారన్నారు. ఆ విధంగా అందరి సమస్యలు తీరిపోతాయని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement