ప్రజల కోసమే ప్రజా సంకల్పయాత్ర | Mla Charitha Reddy says Jagan sankalpayatra helps to people | Sakshi
Sakshi News home page

ప్రజల కోసమే ప్రజా సంకల్పయాత్ర

Published Mon, Nov 6 2017 4:57 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Mla Charitha Reddy says Jagan sankalpayatra helps to people - Sakshi

సాక్షి, వీరపునాయునిపల్లె : ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకే ఏపీ ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

గతంలో మహానేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అదే రీతిలో జగన్‌మోహనరెడ్డి కూడా ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్నాడని, ఆయనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నాయకుడు గౌరు వెంకటరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement