
మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు, పాల్గొన్న రైతు సంఘాల నేతలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్‌లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. సమితి సమావేశం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్‌ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు.
19న వ్యవసాయ మార్కెట్ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment