
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని, బడ్జెట్‌లోనూ మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. బంద్‌కు సహకరించాలని అన్ని పార్టీలను కోరామని, కాంగ్రెస్ నుంచి మద్దతు లభించిందని తెలిపారు. ఇతర పార్టీల నాయకులతో మాట్లాడుతున్నామని, ఈరోజు సాయంత్రానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రజలు, వ్యాపారులు, మేధావులు అందరూ స్వచ్ఛంద బంద్‌లో పాల్గొనాలని కోరారు. బంద్‌ను అడ్డుకోకుండా ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment