సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర బడ్జెట్ పంగనామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కలేదు, ప్యాకేజీ నిధులు అందడం లేదని తెలిపారు. చంద్రబాబు భయభయంగా మాట్లాడితే వచ్చేదేమీ లేదని, ధైర్యముంటే బడ్జెట్‌ను బహిష్కరించి.. పోరాటం చేయాలని సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. పోరాటానికి రెడీ అయితే చంద్రబాబుకు తాము సహకరిస్తామని నారాయణ చెప్పుకొచ్చారు.
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన..
విజయవాడ: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా విజయవాడ బీసెంట్ రోడ్‌లో సీపీఎం ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు, నేతలు బాబూరావు, కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మరోసారి ఏపీకి అన్యాయం జరిగిందని, కనీసం విభజన హామీలను కూడా గౌరవించలేదని సీపీఎం నేతలు దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఈ బడ్జెట్ పై సంతృప్తి వ్యక్తం చేయడం దారుణమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment