
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్ జగన్‌పై లోకేష్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు.
లోకేష్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. గతంలో వైఎస్ జగన్‌పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదా?. అయ్యన్న పాత్రుడిపై కూడా మేం ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీసీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. ఎన్ని కేసులు పెట్టిన న్యాయపరంగా పోరాడతాం. మేం కేసులకు భయపడే వ్యక్తులం కాదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే హోంమంత్రికి చట్టాలు ఉండవా?. కూటమి సర్కార్ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment