మహిళలపై దాడులు.. 200 మంది బుక్కు
నాసిక్: నాసిక్లో కొంతమంది మహిళా ఉద్యమకారులపై దాడి జరిగింది. ఇక్కడి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సదరు మహిళపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు మొత్తం 200 మందిపై కేసులు నమోదుచేశారు. నాసిక్ లో ప్రముఖ త్రయంబకేశ్వర్ ఆలయం ఉంది. ఇందులోకి అనుమతించాలంటూ కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే ఉదయం పూట అనుమతి కుదరదంటూ వారిని అడ్డుకున్నారు.
దీంతో ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు వారిపై దాడులు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షడు అనఘా పఖడే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుణెకి చెందిన స్వరాజ్య సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తి విలేకరులతో మాట్లాడుతూ తమ మహిళల పక్షాన నిలబడి ఉదయం 5గంటల నుంచి ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తామని, ఆలయ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చిన అనుమతి ఇవ్వలేదని చెప్పారు.