Trimbakeshwar Temple
-
త్రయంబకేశ్వర్ శివాలయం లో రవీనా టాండన్, కూతురు రాషా తడాని (ఫొటోలు)
-
మహిళలపై దాడులు.. 200 మంది బుక్కు
నాసిక్: నాసిక్‌లో కొంతమంది మహిళా ఉద్యమకారులపై దాడి జరిగింది. ఇక్కడి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సదరు మహిళపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు మొత్తం 200 మందిపై కేసులు నమోదుచేశారు. నాసిక్ లో ప్రముఖ త్రయంబకేశ్వర్ ఆలయం ఉంది. ఇందులోకి అనుమతించాలంటూ కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే ఉదయం పూట అనుమతి కుదరదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు వారిపై దాడులు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షడు అనఘా పఖడే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుణెకి చెందిన స్వరాజ్య సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తి విలేకరులతో మాట్లాడుతూ తమ మహిళల పక్షాన నిలబడి ఉదయం 5గంటల నుంచి ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తామని, ఆలయ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చిన అనుమతి ఇవ్వలేదని చెప్పారు. -
తృప్తి దేశాయ్ అరెస్ట్
నాసిక్: ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసినందుకు పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాము ఆలయంలోని ప్రవేశించి శివుడికి పూజలు చేశామని ఆమె తెలిపారు. మహిళలను ఆలయంలోకి అనుమతించేలా చూడమని అర్థనారీశ్వరుడిని వేడుకున్నామని వెల్లడించారు. కాగా, త్రయంబకేశ్వర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించడాన్ని స్థానిక మహిళలు నిరసించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పలువురు మహిళలతో కలిసి తృప్తి దేశాయ్ అంతకుముందు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆమె ఆలయంలోకి ప్రవేశించి, చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాలను సవాల్ చేశారు. -
టెంకాయలు నిషిద్ధం..
సాక్షి, ముంబై: ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయంగా వినుతిగాంచిన నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూలు, హారాలు, స్వీట్లు, పూజా సాహిత్యాన్ని నిషేధించారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే అక్కడక్కడ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంతో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి త్రయంబకేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం నమస్కారంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠోర నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు, నాసిక్‌లో పంచవటికి, శిర్డీకి వచ్చిన సాయి భక్తులు, ఇతర పర్యాటకులు ఈ త్రయంబకేశ్వర్‌ను సందర్శించకుండా వెళ్లరు. ఇక్కడే గోదావరి నది పుట్టిన విషయం తెలిసిందే. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమి లేవు. ఇక్కడ అందరు సమానమే. అందుకు దేవుని దర్శనం కోసం ఎవరైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఉన్నాయి. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల తాకిడి కూడా అధికమైంది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని తరుచూ కేంద్ర గుడాచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు, హారాలు, మిఠాయి బాక్స్‌లతో పాటు అర్చన సాహిత్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి నిషేధిస్తున్నారు. ఇదిలా ఉండగా, అర్చన సామాగ్రిని నిషేధించడంలో వీటిపై ఆధారపడిన అనేక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఆలయానికి సమీపంలో, వాహనాల పార్కింగ్ లాట్లో పూజా సామాగ్రి విక్రయించే వందలాది షాపులున్నాయి. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తాము ఉపాధి కోల్పోయి వీధిన పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దండంతో సరిపెట్టుకోవాల్సిందే..!
సాక్షి, ముంబై: ప్రముఖ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూల హారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో శివున్ని దర్శించుకునేందుకు అంత దూరం వెళ్లిన భక్తులు కేవలం నమస్కారం వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో నిత్యం ఈ ఆలయాన్ని వేలాదిమంది సాధారణ భక్తులు, ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. నాసిక్ జిల్లాలో పంచవటి, త్రయంబకేశ్వర్ సమీపంలో ఉన్న కొండ వద్దే గోదావరి నది పుట్టింది. అదేవిధంగా నాసిక్ జిల్లాకు 90 కి.మీ. దూరంలో ప్రముఖ షిర్డీ పుణ్య క్షేత్రం కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు త్రయంబకేశ్వర్‌ను దర్శించుకోనేదే ఉండలేరు. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే. అందువల్ల ఎవరైనా ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్లాల్సిందే. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరగసాగింది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తరుచూ కేంద్ర గూఢచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు,హారాలు, మిఠాయి బాక్స్‌లు తదితర అర్చన సామగ్రిని నూతన సంవత్సరం నుంచి నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.