తృప్తి దేశాయ్ అరెస్ట్ | Activist Trupti Desai detained by police after she entered Trimbakeshwar Temple | Sakshi
Sakshi News home page

తృప్తి దేశాయ్ అరెస్ట్

Published Fri, Mar 25 2016 12:17 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

తృప్తి దేశాయ్ అరెస్ట్ - Sakshi

తృప్తి దేశాయ్ అరెస్ట్

నాసిక్: ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసినందుకు పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాము ఆలయంలోని ప్రవేశించి శివుడికి పూజలు చేశామని ఆమె తెలిపారు. మహిళలను ఆలయంలోకి అనుమతించేలా చూడమని అర్థనారీశ్వరుడిని వేడుకున్నామని వెల్లడించారు.

కాగా, త్రయంబకేశ్వర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించడాన్ని స్థానిక మహిళలు నిరసించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పలువురు మహిళలతో కలిసి తృప్తి దేశాయ్ అంతకుముందు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆమె ఆలయంలోకి ప్రవేశించి, చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాలను సవాల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement