
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా ప్రపంచ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు దలైలామా కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయని మండిపడ్ద సంగతి విధితమే.
గతంలో స్త్రీ పురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన దలైలామా క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment