బాకీ డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేసి.. | Youth Tied To Tree And Thrashed And Filming In Mobile | Sakshi
Sakshi News home page

బాకీ డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేసి..

Published Fri, Mar 30 2018 9:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:39 PM

Youth Tied To Tree And Thrashed And Filming In Mobile - Sakshi

సాక్షి, లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగిన పాపానికి కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. పైగా ఈ తతంగాన్ని వీడియో తీయగా, అది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. డియోరియాకు చెందిన యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తికి కొన్ని నెలల కిందట కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. బుధవారం నాడు తన బాకీ తీర్చాలని యువకుడు అడిగాడు. నగదు తిరిగి చెల్లించకపోగా, అప్పు ఇచ్చిన యువకుడిని చితకబాదారు. ఆపై చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. మరికొందరు వీడియో తీస్తూ ఆనందించారే తప్ప వద్దంటూ వారించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని డియోరియా పోలీసులు వివరించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement