money lender
-
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక..
తిరువళ్లూరు: వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా మారింది. బాధితుడి వాగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఆరంబాక్కం గ్రామానికి చెందిన అన్నాడీఎంకే గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్(50), భార్య సరిత(40). పిల్లలు లేరు. ప్రకాష్ సొంత కారును అద్దెకు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కారు మరమ్మతులకు గురి కావడంతో 2017లో అదే గ్రామానికి చెందిన దఽశరథన్ కుమారుడు రాజా(40) వద్ద రూ. 1.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. లక్ష రూపాయలకు వడ్డీ కింద నెలకు రూ. 11 వేల చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాడు. అయితే కరోనా తరువాత వడ్డీ సక్రమంగా చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి రాజా, అతడి స్నేహితుడు నియాస్ తదితరులు బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వడ్డీ అసలుతో సహా రూ. 2 లక్షలు ఇవ్వాలని లేకుంటే కారును తీసుకెళతామని బెదిరించడంతో అవమానంగా భావించిన ప్రకాష్, అతడి భార్య సరిత గురువారం ఉదయం విషం తాగారు. ఆలస్యంగా గుర్తించిన స్థానికులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి చైన్నె స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. ప్రకాష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సరిత పరిస్థితి విషమంగా మారింది. ప్రకాష్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో తీసుకున్న వాగ్మూలంతో పాటు అత్మహత్యకు మందు తీసిన సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఆరంబాక్కం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బెదిరింపులకు దిగిన రాజా, నియాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
కల్యాణం కోసం అప్పులు.. వధూవరుల పాట్లు
ఆషాఢం ముగిసింది... శ్రావణం వచ్చేసింది. ప్రతీ ఊళ్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. కొత్త జంట ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కల్యాణ తంతు మన కంటికి కనిపించేంత సుళువగా ఏమీ జరగడం లేదట! వివాహం కోసం పెద్దవాళ్లే కాదు వరుడు, వధువు కూడా తిప్పలు పడుతున్నారు. అప్పుల మూట నెత్తిన మోసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: మన యూత్‌కి కోవిడ్‌తో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఓవైపు పెళ్లీడు తరుముతుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. దీంతో యువత ఒత్తిడి లోనవుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయాల్సిన వారు, కొత్త మోడల్ బైకులు, కార్ల గురించి బ్రౌజ్ చేయాల్సి వాళ్లు.. అప్పులు చేసేందుకు ఆతృత పడుతున్నారు. అది కూడా మూడుముళ్ల బంధం కోసం. అవును ఇది నిజం ! ఇండియాలెండ్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ ఆశ్చర్యకర విషయం బయటపడింది. సర్వే జరిగిన తీరు కరోనా సంక్షోభ సమయంలో భారతీయ యువత ఆలోచన ధోరణి ఎలా ఉంది. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ఇండియాలెండ్స్ సంస్థ దేశంలో ఉన్న 20 నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో 20 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న 11 వేల మంది యువతీ యువకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. చదువు, వ్యాపారం, పెళ్లి, టూర్లు, మెడికల్, ఇళ్లు, వాహాన కొనుగోలు, చదువు, పాత బాకీలు తీర్చడం వంటి అవసరాలను ఆప్షన్లుగా పేర్కొంది. వాటిలో దేని కోసం అప్పు చేయాలనుకుంటున్నారనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2020 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు ఒకసారి, 2021 ఏప్రిల్ నుంచి 2021 జులై మధ్య కాలంలో రెండోసారి అభిప్రాయాలను సేకరించింది. పెళ్లే ముఖ్యం మనీ లెండ్ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ 33 శాతం మంది యువత తాము పెళ్లి కోసం అప్పు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా ఓవైపు జాబ్‌లో రిస్క్ పెరిగిందని, మరోవైపు రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్పు చేసైనా సరే సాధ్యమైనంత త్వరగా మ్యారిడ్ పర్సన్‌గా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో ఈ తరహా వాళ్లు కేవలం 22 శాతమే ఉన్నారు. వ్యాపారం చూసుకోవాల్సిందే కోవిడ్ కారణంగా వచ్చిన లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్, ఆన్లైన్ వ్యవస్థతో ప్రైవేటు రంగంలో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది ఉద్యోగుల మెడపై తొలగింపు కత్తి వేలాడుతూనే ఉంది. దీంతో స్వంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో బిజినెస్ కోసం లోను తీసుకుంటామనే వారి సంఖ్య 16 శాతం ఉండగా సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చే సరికి అది 23 శాతానికి పెరిగింది. ఇప్పుడు వద్దే వద్దు కోవిడ్ ఎఫెక్ట్‌తో జీతాల్లో కోత, ఇంకా పుంజుకోని వ్యాపారాలతో జనాల చేతిలో సేవింగ్స్ అడుగంటి పోతున్నాయి. భారీ ఖర్చులు చేసేందుకు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం వంటి ఆలోచణలు వాయిదా వేస్తున్నారు. గతంలో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన వారి తదుపరి లక్క్ష్యంగా ఇంటి నిర్మాణం ఉండేది. ఇప్పుడు వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది ఇంటిలోన్లు పెడతామని చెప్పగా సెకండ్‌వేవ్ దగ్గరికి వచ్చే సరికి 24 శాతానికి పరిమితం అయ్యారు. పెళ్లి తర్వాత ఆస్పత్రి ఖర్చులే కోవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో ఇంటి నిర్మాణం గురించి ఆలోచన చేసిన యువత సెకండ్‌వేవ్ వచ్చే సరికి ఇంటిని పక్కన పెట్టి పెళ్లికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు వ్యాపారం చేసుకోవడానికి సగటున రూ.2.62 లక్షల లోను చాలు అని చెబుతున్న వారు పెళ్లి దగ్గరికి వచ్చే సరికి లోను అమౌంట్‌ని రూ. 4.13 శాతానికి పెంచేశారు. ఇదే సమయంలో మెడికల్ ఖర్చుల కోసం కూడా రూ. 4 లక్షల వరకు లోను తీసుకునేందుకు రెడీ అయ్యారు. కోవిడ్ కారణంగా పెరిగిన మెడికల్ ఖర్చులు యువతకి భారంగా మారాయి. -
వడ్డీ వ్యాపారి లైంగిక వేధింపులు
గుంటూరు: వడ్డీకి డబ్బులు తీసుకుంటే.. ఆ వడ్డీ వ్యాపారి, తనకు పరిచయస్తుడైన వ్యక్తితో కలసి లైంగిక వేధింపులకు దిగడంతో సోమవారం ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో షేక్ అజీమున్నీసా సీనియర్ అసిస్టెంట్. 2009లో భర్త హుసేన్ మరణానంతరం ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం స్వగ్రామం నరసరావుపేటకు చెందిన ఇన్నమూరి మాధవరావు ద్వారా వడ్డీ వ్యాపారి మట్టా ప్రసాదు వద్ద రూ.5 వడ్డీకి రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులిచ్చింది. ప్రతి నెలా రూ.15 వేలు వడ్డీ చెల్లిస్తోంది. అయినా వారిద్దరూ ఒత్తిడి చేసి ఏటీఎం కార్డు కూడా తీసుకున్నారు. రెండున్నరేళ్లలో రూ.8 లక్షలు డ్రా చేసుకున్నా.. అప్పుతీరలేదంటూ కోర్టులో కేసు వేశారు. కేసు తొలగించాలన్నా తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. దీనిపై రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం డీపీవో ఆవరణలోని క్యాంటీన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. వడ్డీ వ్యాపారి వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని బాధితురాలికి అండగా నిలవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వివరాలను సేకరించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. -
హత్య చేసి.. గోడ మీద రాసి వెళ్లాడు
గాంధీనగర్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడమే కాక అందుకు గల కారణాన్ని గోడ మీద రాసి మరీ వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. గుజరాత్ బనస్కాంత జిల్లా కుడా గ్రామానికి చెందిన ఉకభాయ్ పటేల్ స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద రూ. 21 లక్షలు అప్పు చేశాడు. తిరగి చెల్లించలేక పోయాడు. దాంతో సదరు వడ్డీ వ్యాపారి గురువారం రాత్రి ఉకభాయ్ ఇంటికి వచ్చి పదునైన ఆయుధంతో ఉకభాయ్‌తో పాటు అతని భార్య, కుమార్తె, కొడుకుల గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అంతేకాక తన అప్పు చెల్లించనందువల్లే ఉకభాయ్ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు గోడ మీద రాసి మరీ వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఉకభాయ్ కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అప్పు చెల్లించాలని ఇంటికి తాళం
కొత్తూరు : తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని దౌర్జన్యం చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన మండలంలోని సిద్ధాపూర్ పంచాయతీ పులిచర్లకుంటతండాలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్సై శ్రీశైలం వివరాల ప్రకారం... సిద్ధాపూర్‌కు చెందిన షరీఫ్ వద్ద పులిచర్లకుంటతండాకు చెందిన లింగ్యానాయక్ రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుండి షరీఫ్ వద్ద కూలీ పనులు చేస్తున్నాడు. ఇటీవల తాను అనారోగ్యానికి గురికావడంతో పనికి వెళ్లడం లేదు. కాగా షరీఫ్ తన వద్దకు పనికి రావాలని లేని పక్షంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించాలని లింగ్యా ఇంటి వద్ద గొడవకు దిగాడు. అంతటితో శాంతించకుండా ఇంట్లో ఉన్న లింగ్యా భార్య లిలీని వారి పిల్లలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. అప్పు త్వరలో తీర్చుతామని వేడుకున్నా కనికరించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో షరీఫ్, అతడి కుమారుడు సలీంలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. కాగా రూ. 80 వేలు అప్పుగా తీసుకొని రెండేళ్ల పాటు కూలీ పనులు చేసినా అప్పు తీరలేదంటూటు షరీఫ్ తన భర్తను భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం చేస్తున్నాడని లింగ్యా భార్య లిలీ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. -
బాకీ డబ్బులు అడిగిన పాపానికి
-
బాకీ డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేసి..
సాక్షి, లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగిన పాపానికి కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. పైగా ఈ తతంగాన్ని వీడియో తీయగా, అది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. డియోరియాకు చెందిన యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తికి కొన్ని నెలల కిందట కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. బుధవారం నాడు తన బాకీ తీర్చాలని యువకుడు అడిగాడు. నగదు తిరిగి చెల్లించకపోగా, అప్పు ఇచ్చిన యువకుడిని చితకబాదారు. ఆపై చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. మరికొందరు వీడియో తీస్తూ ఆనందించారే తప్ప వద్దంటూ వారించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని డియోరియా పోలీసులు వివరించారు. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా
మీరట్: తండ్రికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యక్తిని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురు యువతులు షమ్లీలోని అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి.. కత్తులతో పొడిచి చంపారు. హత్యకు గురైన వ్యక్తి శరీరంలో 20 కత్తిపోట్లు ఉండటం చూసి పోలీసులే విస్తుపోయారు. ఘటన వివరాలు.. షమిమ్ అహ్మద్ అనే వడ్డీ వ్యాపారి ఓ వ్యక్తికి లక్షరూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీర్చడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని వేదించడంతో పాటు అతడి కూతుళ్లపై అహ్మద్ కన్నేశాడు. అప్పు వంకతో ఇంటికి వెళ్లి అతడి ముగ్గరు కూతుళ్లను వేదించాడు. వారిలో ఒకరిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ముగ్గురు అక్కాచెలెళ్లు కత్తులతో వెళ్లి విచక్షణారహితంగా అహ్మద్‌పై దాడిచేశారు. దీంతొ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు యువతులతో పాటు.. ఈ హత్యకు సహకరించిన తండ్రి, ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.