తిరువళ్లూరు: వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా మారింది. బాధితుడి వాగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఆరంబాక్కం గ్రామానికి చెందిన అన్నాడీఎంకే గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్(50), భార్య సరిత(40). పిల్లలు లేరు. ప్రకాష్ సొంత కారును అద్దెకు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కారు మరమ్మతులకు గురి కావడంతో 2017లో అదే గ్రామానికి చెందిన దఽశరథన్ కుమారుడు రాజా(40) వద్ద రూ. 1.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
లక్ష రూపాయలకు వడ్డీ కింద నెలకు రూ. 11 వేల చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాడు. అయితే కరోనా తరువాత వడ్డీ సక్రమంగా చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి రాజా, అతడి స్నేహితుడు నియాస్ తదితరులు బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వడ్డీ అసలుతో సహా రూ. 2 లక్షలు ఇవ్వాలని లేకుంటే కారును తీసుకెళతామని బెదిరించడంతో అవమానంగా భావించిన ప్రకాష్, అతడి భార్య సరిత గురువారం ఉదయం విషం తాగారు. ఆలస్యంగా గుర్తించిన స్థానికులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి చైన్నె స్టాన్లీ వైద్యశాలకు తరలించారు.
ప్రకాష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సరిత పరిస్థితి విషమంగా మారింది. ప్రకాష్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో తీసుకున్న వాగ్మూలంతో పాటు అత్మహత్యకు మందు తీసిన సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఆరంబాక్కం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బెదిరింపులకు దిగిన రాజా, నియాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment