అంతర్జాతీయ స్థాయి విలువలతో.. అగస్తియ
తమిళసినిమా: ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం అగస్తియ. వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత డాక్టర్ ఐసరి గణేష్, వామిండియ సంస్థ అధినేత అనీష్ అర్జున్ దేవ్ కలిసి నిర్మించిన ఈ భారీ చిత్రంలో నటుడు జీవ, అర్జున్, రాశీఖన్నా ప్రధానపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, దీపక్ కుమార్ మది ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ఈనెల 28వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర సభ్యులు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు పా.విజయ్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ రాయడం ప్రారంభించినఫ్పటినుంచే చాలా అన్వేషించడం జరిగిందన్నారు ఈ చిత్రాన్ని ఎలా జనరంజకంగా తెరపై ఆవిష్కరించాలి. సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఎలా చెప్పగలగాలి అని భావించినప్పుడు బలమైన సాంకేతిక వర్గం అవసరం అనిపించిందన్నారు. అదేవిధంగా కథ రాసి ఉన్నప్పుడే ఇది సాధారణ హారర్ కథాచిత్రంగా కాకుండా వైవిధ్య భరిత హారర్, ఫాంటసీ కళాచిత్రంగా ఉండాలని భావించానన్నారు. తాను చెప్పే కంటెంట్ అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. చిత్ర షూటింగును 65 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత చిత్రంలో 90 నిమిషాల పాటూ వీఎఫ్‌ఎక్స్ పనులు అవసరమని భావించామన్నారు. అందుకు ఏడాది పాటూ సమయాన్ని తీసుకున్నట్లు దర్శకుడు చెప్పారు. నటుడు జీవా మాట్లాడుతూ కథ మొత్తం విన్న తర్వాత ఇది హార్రర్ అన్నది చెప్పడానికి మాత్రమేనని అని అగస్తియా భారతీయ సినీ ప్రేక్షకులను అలరించే విధంగా థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, యానిమేషన్, ఫాంటసీ వంటి మిక్స్‌డ్ జానర్లో రూపొందిన కథ చిత్రం అని చెప్పారు. ఇందులోని అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ సన్నివేశాలు, యానిమేషన్ కథాపాత్రలు చూసి ఆబాల గోపాలం అలరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణతో పాటూ ఉత్తర భారతదేశంలో మొత్తం 780 థియేటర్లకు పైగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఐ. గణేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment