మంత్రి పర్యటన కోసం..
● వివాదాస్పద స్థలంలో రోడ్డు ఏర్పాటు ● కోర్టు ఆదేశాలను ఉల్లఘించారని ఆరోపణ
తిరువళ్లూరు: మంత్రి పర్యటన కోసం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని బాధితుడు నిరసనకు దిగాడు. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని జేఎన్ రోడ్డులో వీఎం నగర్‌కు వెళ్లే దారిలో వివాదాస్పద స్థలంపై కేసు ఏళ్ల తరబడి కోర్టులో సాగింది. కేసును విచారించిన న్యాయస్థానం బాధితుడి వద్ద డాక్యుమెంట్‌లను ఆధారంగా తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఒకవేళ మున్సిపాలిటీ ప్రజా ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని అక్కడ రోడ్డునిర్మాణం ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడికి ఽమొత్తాన్ని చెల్లించడంతో పాటూ ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సూచించింది. అంత వరకు అక్కడ రోడ్డు తదితర నిర్మాణాలు చేయవద్దని కోరారు. అయితే ఈ రోడ్డుకు సమీపంలోనే సోమవారం ఉదయం మంత్రి నాజర్ పర్యటన వుండడంతో హడావిడిగా రోడ్డును నిర్మించారు. ఈ ఘటనపై బాధితుడు విలపించాడు. తన కు న్యాయం చేయాలని అధికారులను కోరినా ఫలి తం లేకపోగా నిర్మాణాలను పూర్తి చేశారు. కాగా ఈ ఘటనపై సోమవారం ఉదయం హైకోర్టులో పిల్ వేస్తానని, కోర్టు ధిక్కరణ కింద అధికారులను చే ర్చుతానని హెచ్చరించాడు. కాగా మంత్రి పర్యటన కోసం కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రోడ్డు నిర్మించడంపై చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment