హిస్టారికల్ హారర్ థ్రిల్లర్‌గా.. మడల్
తమిళసినిమా: కలెక్టీయస్ గ్రూప్ నిర్వాహక డైరెక్టర్ ప్రశాంత్ జాసన్ సామ్యువేల్ పీజేఎస్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం మడల్. సిలనేరంగళిల్ మనిదర్ గళ్, అన్బిర్కినియాళ్ చిత్రాల ఫేమ్ ప్రవీణ్ రాజా కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఇంగ నాందాన్ కింగు చిత్రం ఫేమ్ ప్రియ లైలా నాయకిగా నటిస్తున్నారు. నిళల్ గల్ రవి, బాలాసరవణన్, వివేక్ ప్రసన్న, కృష్ణ దయాళ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా హరిశంకర్ రవీంద్రన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు మ ణికంఠన్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్ర యూ నిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపు తూ ఇది హిస్టారికల్‌తో కూడిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. పలు శతాబ్దాల క్రితం చరిత్రలో జరిగిన మన తమిళ సంస్కృతికి సంబంధించిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మడల్ అని చెప్పారు. మడల్ అంటే లేఖ లేదా గుర్రం అనే అర్థం వస్తుందన్నారు. అలా ఒక గుర్రం ప్రధాన ఇతివృత్తంతో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. తమిళ సినిమాలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని కొత్త కోణంలో ఈ హిస్టారికల్ హారర్ థ్రిల్లర్ కథా చిత్రం ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండదని దర్శకుడు పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను మార్చి నెల నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. దీనికి శ్రీకాంత్ చాయాగ్రహణం, సునీల్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment