పీడియాట్రిక్‌ దంత వైద్యంలో రికార్డు | - | Sakshi
Sakshi News home page

పీడియాట్రిక్‌ దంత వైద్యంలో రికార్డు

Published Mon, Feb 24 2025 1:02 AM | Last Updated on Mon, Feb 24 2025 12:58 AM

పీడియాట్రిక్‌ దంత వైద్యంలో రికార్డు

పీడియాట్రిక్‌ దంత వైద్యంలో రికార్డు

సాక్షి, చైన్నె: పీడియాట్రిక్‌ దంత వైద్యంలో సవీత దంత కళాశాల వైద్యులు డాక్టర్‌ ఎం. నందిని దేవి కొత్త రికార్డును సృష్టించారు. పీడియాట్రిక్‌ – ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీ విభాగం ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆమెను ఆ విద్యా సంస్థ చాన్స్‌లర్‌ వీరయ్యన్‌ అభినందించారు. ఆమె జనరల్‌ అనస్థీషియా కింద 110 ఫుల్‌ మౌత్‌ రిహాబిలిటేషనన్‌(ఎఫ్‌ఎంఆర్‌), కాన్షియస్‌ సెడేషన్‌ కింద 132 కేసులను తన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ శిక్షణ సమయంలో విజయవంతంగా పూర్తి చేశారు. పీడియాట్రిక్‌ డెంటిస్ట్‌గా ఈ విజయాన్ని సాధించి ఆమె రికార్డుకెక్కారు. ఈ చారిత్రాత్మక మైలురాయి ఆమె అసాధారణమైన అంకితభావం, క్లినికల్‌ నైపుణ్యం, పీడియాట్రిక్‌ డెంటల్‌ కేర్‌ అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడంలో ఉపయోగకరంగా మారింది. జనరల్‌ అనస్థీషియా కింద ఇంత పెద్దసంఖ్యలో కేసులను నిర్వహించడానికి అపారమైన ప్రతిభ, లోతైన జ్ఞానం, అవగాహన , ఉన్నతమైన శస్త్రచికిత్స నైపుణ్యాలను శిక్షణ కాలంలో ప్రదర్శించిన డాక్టర్‌ నందిని దేవి సీమాట్స్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వీరయ్యన్‌ శనివారం అభినందించి సత్కరించారు. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేశారు. డాక్టర్‌ నందిని దేవి సాధించిన విజయం పీడియాట్రిక్‌ – ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీలో క్లినికల్‌ ఎక్సలెన్స్‌, నిబద్ధతకు నిదర్శనంగా ఆ విద్యా సంస్థ డీన్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement