ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా | moneylender stabbed to death by three sisters | Sakshi
Sakshi News home page

ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా

Published Fri, Sep 23 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా

ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా

మీరట్: తండ్రికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యక్తిని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ముగ్గురు యువతులు షమ్లీలోని అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి.. కత్తులతో పొడిచి చంపారు. హత్యకు గురైన వ్యక్తి శరీరంలో 20 కత్తిపోట్లు ఉండటం చూసి పోలీసులే విస్తుపోయారు.
 
ఘటన వివరాలు.. షమిమ్ అహ్మద్ అనే వడ్డీ వ్యాపారి ఓ వ్యక్తికి లక్షరూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీర్చడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని వేదించడంతో పాటు అతడి కూతుళ్లపై అహ్మద్ కన్నేశాడు. అప్పు వంకతో ఇంటికి వెళ్లి అతడి ముగ్గరు కూతుళ్లను వేదించాడు. వారిలో ఒకరిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ముగ్గురు అక్కాచెలెళ్లు కత్తులతో వెళ్లి విచక్షణారహితంగా అహ్మద్పై దాడిచేశారు. దీంతొ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు యువతులతో పాటు.. ఈ హత్యకు సహకరించిన తండ్రి, ఓ యువతి బాయ్ఫ్రెండ్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement