Three sisters
-
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
‘త్రీ’ చీర్స్.. చరిత్ర సృష్టించిన అక్కాచెల్లెళ్లు
కాఠ్మాండు: చాలా మంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా పొందుతారు. కానీ తండ్రి ఇష్టాన్నే తమ ఇష్టంగా భావించారీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తండ్రికి ఇష్టమైన పర్వతారోహణను వారూ స్వీకరించి ముగ్గురికి ముగ్గురూ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డునూ నెలకొల్పారు. ఇప్పటివరకూ ఇంతమంది అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కలేదట. ఆ రికార్డును వారు తమ తండ్రికి అంకితం కూడా చేశారు. ఇది తమ మొదటి అడుగేనని, త్వరలో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన ‘సెవెన్ సమ్మిట్స్’ పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నారు నేపాల్‌కు చెందిన దావా ఫుతి షెర్పా, నిమా జంగ్మూ షెర్పా, సెరింగ్ నంగ్యా షెర్పా. వీళ్ల తాత కూడా పర్వతారోహకుడే. ఇక వాళ్ల నాన్న డోర్జీ షెర్పా పర్వతారోహణ శిక్షకుడిగా, గైడ్‌గానూ పనిచేశాడు. మొట్టమొదటి సారి ఆయన 1982లో జపనీస్ పర్వతారోహకులతో కలిసి చలికాలంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆ చల్లదనానికి ఆయన ఎనిమిది వేళ్లు పాడైపోయాయి. అయినా ఆయన పర్వతారోహణను మానలేదు. 2007 వరకు కొనసాగించాడు. ఆ తండ్రి వారసత్వాన్ని పిల్లలూ తీసుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్లకంటే ముందు వాళ్ల సోదరుడు మింగ్మా సైతం ఆరుసార్లు ఎవరెస్టును అధిరోహించాడు. అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పర్వతారోహకులన్నమాట. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట
వాషింగ్టన్ : ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేరోజున ఒకే హాస్పిటల్లో ప్రసవించిన ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం..దనీషా హేన్స్, ఏరియల్ విలియమ్స్, ఆష్లే హేన్స్ అనే అక్కాచెల్లెళ్లు ఈనెల 3న ఒకే ఆసుపత్రిలో కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో బిడ్డలకు జన్మనిచ్చినట్లు మాన్స్ఫీల్డ్ న్యూస్ జర్నల్ నివేదించింది. . 50 మిలియన్లలో ఎవరో ఒక్కరికి ఇలా జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ముగ్గురికీ డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఒకరే కావడం విశేషం. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించాడని తెలుస్తోంది. ఇక ఒకేరోజు తమ బిడ్డలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని ముగ్గురు సోదరీమణులు పేర్కొన్నారు. మొదటగా విలియమ్స్ పురుడు పోసుకోగా పాపకు సిన్సిర్ అని పేరు పెట్టారు. ఈమె బరువు 8 పౌండ్లు ఉండగా, తదనంతరం ఆష్లే హేన్స్ ..అడ్రియన్ అనే కుమారుడికి జన్మనివ్వగా అతని బరువు 10 పౌండ్లు ఉంది. చివరగా ప్రసవించిన దనీషాకు పుట్టిన శిశువుకు ఎమ్రీ అని నామకరణం చేశారు. అందరికంటే ఈ చిన్నారి బరువు 14 పౌండ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవజాత శిశువుల బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై తల్లి డెబోరా వేర్ స్పందిస్తూ..ఇక మా పార్టీలో అదనంగా వేరే పిల్లలు ఉండరేమో అంటూ చమరత్కరించారు. (ఆ బాబు నిజంగానే మూడు కళ్లతో జన్మించాడా?) -
విశాఖలో ముగ్గురు బాలికల అదృశ్యం
-
ముగ్గురు అక్కాచెల్లెళ్లు తుపాకులతో కాల్చేశారు
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 13 ఏళ్ల క్రితం దైవదూషణ చేసిన వ్యక్తిని తుపాకులతో కాల్చి చంపేశారు. అప్పట్లో తాము చిన్నపిల్లలు కావడంతో అతన్ని చంపలేకపోయామని, ఇప్పుడు శిక్ష విధించామని చెప్పారు. 2004లో ఫాజల్ అబ్బాస్ (45) అనే వ్యక్తి దైవదూషణ చేసినట్టు అక్కాచెల్లెళ్లు చెప్పారు. అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. కాగా పాకిస్థాన్ వీడి బెల్జియం వెళ్లిన అబ్బాస్ ఇటీవల స్వదేశం తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కాచెల్లెళ్లు అబ్బాస్ ఇంటికి వెళ్లారు. తాము అబ్బాస్‌ను కలవాలని ఆయన తండ్రితో చెప్పారు. ఇంట్లో నుంచి అబ్బాస్ బయటకు రాగానే బురఖాలో దాచిన తుపాకీలను తీసి ముగ్గురు అక్కాచెల్లెళ్లు సమీపం నుంచి అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. 13 ఏళ్ల తర్వాత తాము దైవదూషకుడికి శిక్ష విధించామని వారు నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో దైవదూషణ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ వారంలోనే పాక్‌లో మరో ఘటనలో మషాల్ ఖాన్ (23) అనే యువకుడి ఇలాంటి ఆరోపణలపైనే కొట్టి చంపారు. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా
మీరట్: తండ్రికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యక్తిని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురు యువతులు షమ్లీలోని అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి.. కత్తులతో పొడిచి చంపారు. హత్యకు గురైన వ్యక్తి శరీరంలో 20 కత్తిపోట్లు ఉండటం చూసి పోలీసులే విస్తుపోయారు. ఘటన వివరాలు.. షమిమ్ అహ్మద్ అనే వడ్డీ వ్యాపారి ఓ వ్యక్తికి లక్షరూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీర్చడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని వేదించడంతో పాటు అతడి కూతుళ్లపై అహ్మద్ కన్నేశాడు. అప్పు వంకతో ఇంటికి వెళ్లి అతడి ముగ్గరు కూతుళ్లను వేదించాడు. వారిలో ఒకరిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ముగ్గురు అక్కాచెలెళ్లు కత్తులతో వెళ్లి విచక్షణారహితంగా అహ్మద్‌పై దాడిచేశారు. దీంతొ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు యువతులతో పాటు.. ఈ హత్యకు సహకరించిన తండ్రి, ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. -
3 సిస్టర్స్ 3 ఛీర్స్
ఒలింపిక్స్‌లో ఒక కుటుంబంనుంచి ఒకరు పాల్గొంటేనే పెద్ద సంబరం... అదే ఇద్దరు అయితే దానిని అద్భుతంగా చెప్పవచ్చు... ఇక ఒక ఫ్యామిలీలో ఒకేసారి పుట్టిన, ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు ఒకేసారి ట్రాక్‌పై పరుగెడుతుంటే చూడటానికి ఎన్ని కనులు కావాలి? అదీ ఆ ముగ్గురు మూడు పదుల మహిళలు అయితే దానిని మహాద్భుతంగానే వర్ణించాలి. ఇలాంటి కలల దృశ్యం రియో ఒలింపిక్స్‌లో సాక్షాత్కరించే అవకాశం ఉంది. ఎస్తోనియా దేశపు అక్కాచెల్లెళ్లు తొలిసారి ఈ స్వప్నాన్ని నిజం చేయబోతున్నారు. * ఎస్తోనియా సోదరీమణుల అరుదైన ఘనత * ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే సారి బరిలోకి * రియో ఒలింపిక్స్‌లో ‘స్పెషల్’ సిస్టర్స్ ఆ ముగ్గురు ఒకే సమయంలో పుట్టిన సొంత అక్కాచెల్లెళ్లు. రూపురేఖల మొదలు కట్టు బొట్టూ అన్నీ ఒకలాగే. కవలలకంటే వారు ‘ఒక ఆకు’ ఎక్కువే చదివారు. అందుకే చిన్నప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ముగ్గురమొకటై మరో జగం... అంటూ ఆడి పాడారు. అలాంటి ఆటల్లోనే వారు పరుగు నేర్చారు. ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ఇలాంటి ఉత్సాహంలో ఈ పరుగేదో బాగుందనిపించింది. అంతే... సీరియస్‌గా పరుగెత్తాలని ఒట్టేసుకున్నారు. ఆటల గురించి మరచిపోయి సంసారాల్లో బిజీగా మారిపోయే 24 ఏళ్ల వయసులో వారు తొలిసారి పోటీల్లో పరుగెత్తారు. రైలు బండిలా ఒకరి తర్వాత మరొకరికి ఇలా వరుసగా మూడు స్థానాలు దక్కాయి. ఈ సమయంలోనే వీరిని చూసిన హ్యరీ లాంబర్గ్ అనే కోచ్ ఈ పరుగు ‘మూన్నాళ్ల’ ముచ్చగా మిగిలిపోవద్దంటూ నేను శిక్షణ ఇస్తానంటూ ముందుకొచ్చాడు. కట్ చేస్తే...లీలా, లీనా, లిలీ (ల్యూక్ సిస్టర్స్) రియో ఒలింపిక్స్‌లో మారథాన్ ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించేశారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 200 మంది కవలలు పాల్గొన్నా... ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు మాత్రం ఎప్పుడూ బరిలోకి దిగలేదు. ఇప్పుడు ఎస్తోనియా సిస్టర్స్ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. మారథాన్ వైపు... ఈ ముగ్గురు సోదరీమణులు అథ్లెటిక్స్ ప్రారంభించాక తమకు స్ప్రింట్స్కంటే లాంగ్ డిస్టెన్స్ పరుగు బాగా సరిపోతుందని భావించారు. అందుకే దానిపైనే దృష్టి పెట్టి మారథాన్‌లో ప్రతిభను ప్రదర్శించారు. ముందుగా జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు వచ్చాక యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఇదే జోరులో వారు ఒలింపిక్స్ లక్ష్యంగా తీవ్రంగా శ్రమించారు. టార్టు నగరానికి చెందిన ఈ త్రయం ‘ట్రయో ఫర్ రియో’ అనే టీమ్ పేరుతో బరిలోకి దిగి రియోకు క్వాలిఫై అయ్యారు. ఎస్తోనియాలో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే వీరంతా ప్రాక్టీస్ సమయంలో మాత్రం ఒకే చోటికి చేరతారు. సాధన సమయంలో కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, తప్పులు సరిదిద్దు కోవడం ఈ సిస్టర్స్‌కు రొటీన్. కెన్యా కొండల్లో రియో కోసం కలిసే సిద్ధమయ్యారు. ఒంటరిగా ప్రాక్టీస్ చేయడం చాలా బోరని చెప్పే వీరు... ప్రతీ రేస్‌లో అప్పటికి టాప్‌లో ఉన్న సోదరి టైమింగ్‌ను దాటడం లక్ష్యంగా పెట్టుకుంటారు! పతకం కష్టమే ఎస్తోనియా తరఫున మారథాన్‌లో మూడు బెర్త్‌లు ఉండగా ఈ ముగ్గురే అర్హత సాధించారు. కాబట్టి రియో వేదికపై కూడా అంతా కలిసి పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆ దేశపు స్థాయిలో టాప్ అథ్లెట్లే అయినా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వీరు చాలా దూరంలో ఉన్నారు. వీరిలో అత్యుత్తమమైన లీలా టైమింగ్ 2 గంటల 37.12నిమిషాలు ఒలింపిక్ రికార్డుకంటే 15 నిమిషాలు ఎక్కువ! ఆ తర్వాత రెండున్నర నిమిషాలు ఎక్కువగా లీనా ఉండగా, మరో 45 సెకన్లు ఆలస్యంగా లిలీ టైమింగ్ ఉంది. కాబట్టి ఎలా చూసినా ఆఫ్రికన్ అథ్లెట్లతో పోటీ పడే సత్తా కనిపించడం లేదు. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమంత ఉన్న ఈ సిస్టర్స్ ‘ఏమో, సాధిస్తామేమో, మా ప్రయత్నం అయితే చేస్తాం’ అని ఏకకంఠంతో చెబుతున్నారు. పతకం దక్కకపోయినా...ఈ సూపర్ త్రీ సిస్టర్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. - సాక్షి క్రీడా విభాగం -
రైలుకింద పడి అక్కా చెల్లెళ్ల మృతి
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.. మరో సోదరి పరిస్థితి విషమం విజయవాడ (భవానీపురం): తండ్రి మరణాన్ని తట్టుకోలేని ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో సోదరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే ట్రాక్‌పై శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు.. మృతురాళ్ల తండ్రి అబ్దుల్ రఫీ లారీ డ్రైవర్. రాయనపాడులోని ఒక బిస్కెట్ కంపెనీ గోడౌన్ నుంచి సరుకు చేరవేస్తుంటాడు. ఆయన భార్య షాకిరా సుల్తానా అనారోగ్యంతో ఉండటంతో గురువారం విజయవాడ ఆస్పత్రిలో ఉన్న ఆమెను చూసి ఇంటికి వస్తున్నానని పోరంకిలోని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా, గురువారం ఉదయం పోరంకి ఎస్బీఐ ఏటీఎం దగ్గర రఫీ చనిపోయి ఉన్నట్లు అతని బావమరిదికి సమాచారం వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న రఫీ కుమార్తెలు రుకియా సుల్తానా, షాహిన్, పర్వీన్‌లకు తెలిసింది. విజయవాడ వచ్చిన వారు తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో రాయనపాడు వచ్చారు. ఏమనుకున్నారో ఏమో రైలుకింద పడి చనిపోవడానికి నిర్ణయించుకున్న వారు అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. షాహిన్ (21), పర్వీన్(19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశం పక్కనే ఉన్న చిన్న గుంతలో రుకియా సుల్తానా(22) పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రుకియా సుల్తానాకు నెల కిందటే వివాహమైంది. ఆమె భర్త అమెరికాలో ఉన్నారు. -
జుకర్ బర్గ్ షేర్ చేసిన ఫోటో ఏంటో తెలుసా?
వాషింగ్టన్: ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పూర్తి స్థాయిలో పితృత్వాన్ని అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో తన ముద్దుల చిన్నారి ఫోటోలను మురిపెంగా షేర్ చేసిన ఆయన తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 10 వరల్డ్ సిబ్లింగ్ డే సందర్భంగా ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. అక్కచెల్లెళ్లు అరెల్లె, డొన్నా, రాండీ జుకర్ బర్గ్ లకు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతమైన తోబుట్టువులకు అభినందనలు. 1980లో స్కై జాకెట్లుతో తమ బాల్యం చాలా బాగా గడిచిందంటూ అప్పటి మధురమైన క్షణాలన, జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ప్రతి ఏటా ఏప్రిల్ 10వ ‘సిబ్లింగ్ డే’ జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని 1980లో తన సిబ్లింగ్స్ తో దిగిన ఒక ఫొటోను జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. ఒంటె ఆకారంలో ఉన్న ఒక చెక్క దిమ్మెపై జుకర్ బర్గ్ తన ముగ్గురు సోదరీమణులతో కలిసి కూర్చుని ఉన్న ఫోటోను పంచుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ జుకర్ ఫేస్ లో పెద్దగా తేడా ఏమీ లేదనీ, అతని కళ్లల్లో భవిష్యత్తు మెరుపు స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. -
చిట్టితల్లికి ఎన్ని శాపాలో..
బేటీ బచావోలో ఈ రోజు కనిపించే అమ్మాయిలాంటి వాళ్లెందరికో నగరాల్లోని పాష్ లొకాలిటీస్లు ఆవాసాలు. ఇది ఓ పదేళ్లమ్మాయి జీవితం! ఉనికి సహజం అయినప్పుడు పేరు అనవసరం! కాబట్టి నేరుగా ఆమె కథలోకి వెళ్దాం. ఈ అమ్మాయి వాళ్లది ఆంధ్రలోని మారుమూల పల్లెటూరు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఆఖరుది. పెద్దక్క పెళ్లయింది. రెండో అక్క అమ్మానాన్నలతోపాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఇద్దరన్నలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు చదువు కోసం. ఈ ఇద్దరు మగపిల్లల్ని చదివించడం కోసం తల్లి, తండ్రి, అక్కతో కలసి పదేళ్ల ఈ పిల్లా శ్రమదానం చేస్తోంది. ఎలా.. తన అమ్మానాన్నలు పనిచేసే పొలం యజమానికి ఒక్కడే కొడుకు. హైదరాబాద్‌లో ఉంటున్నాడు వ్యాపార నిమిత్తం. అతని భార్య ప్రభుత్వోద్యోగి. ఇద్దరు పిల్లలు. చిన్న పిల్లాడికి నెలల వయసుంటుంది. ఆ పిల్లాడి ఆలనాపాలనకు ఈ పిల్లను తెచ్చుకున్నారు. అంటే బాలకార్మికురాలిగా అన్నమాట. అదీ జీతమిచ్చి కాదు. వెట్టికి. కారణం.. ఈ పిల్ల అక్క పెళ్లికి వాళ్ల నాన్న ఈ వ్యాపారి తండ్రి దగ్గర పాతికవేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు కింద పదేళ్ల బిడ్డను ఇక్కడికి పంపించాడు. పిల్లాడి బాధ్యత.. తన తిండి తనకే సరిగ్గా తినడం రాని ఆ చిట్టితల్లి చిట్టిచిట్టి చేతులతో ఇంకో చంటోడికి ముద్దలు తినిపించాలి. వాడు సరిగ్గా తినకపోతే ఈ అమ్మాయికి వీపు మీద వాతలే! సన్నగా పీలగా ఉన్న ఈ పిల్ల బొద్దుగా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలుడిని పొద్దస్తమానం చంకనెత్తుకొని మోయాలి. కింద దించితే వాడు రాగం తీస్తాడు. అమ్మగారు పొద్దున లేవగానే ఆఫీస్‌కెళ్లే హడావిడిలో ఉంటారు కాబట్టి పిల్లాడు ఏడ్వకుండా వాడి బాధ్యతలన్నీ ఈ పిల్లే చూసుకోవాలి.. ఆవిడ ఆఫీస్‌కు వెళ్లిపోతే ఎవరూ ఉండరు కాబట్టి మళ్లీ ఈ అమ్మాయికే ఆ భారం. అమ్మగారు ఆఫీస్‌లో పనిచేసి అలసిపోయి వస్తారు.. ఆవిడకు కాస్త విశ్రాంతి కావాలి.. ఆ పిల్లాడిని సాయంకాలం ఈ పిల్లే లాలించాలి. పదేళ్లకే ఓ తల్లి మోయాల్సిన భారం ఈ చిన్నతల్లి మోస్తోంది. ఆమెకన్నా రెండేళ్లే చిన్నోడైన అమ్మగారి పెద్దకొడుకు ఎంచక్కా స్కూల్‌కి వెళ్తాడు. స్నేహితులతో ఆడుకుంటాడు.. పాడుకుంటాడు.. కావల్సింది తింటాడు.. హాయిగా నిద్దరోతాడు! దీనికి పూర్తిగా విరుద్ధం ఈ అమ్మాయి జీవితం! ఇలాంటి వెట్టి జీవితాలు హైదరాబాద్‌లోని పెద్దిళ్లల్లో చాలా కనిపిస్తాయి. ఓవైపేమో ప్రభుత్వాలు బాలకార్మిక వ్యవస్థను రద్దుచేయడానికి కఠిన చర్యలు అంటాయి.. ఇంకో వైపు బేటీలను బచాయించడానికి కంకణాలు కట్టుకుంటాయి. అయినా ఈ పిల్లల తలరాతలు మానవు. ముగింపు ఇలాంటి వెతలకు ముగింపు కావాలి. ఎప్పుడు ? ఏమో! బేటీ బచావో ప్రచారానికి ‘సిటీప్లస్’ పెన్ను పట్టి నెలవుతోంది. నేటితో విరామమిస్తోంది. ఈ నెలరోజుల్లో ఇక్కడ ప్రచురితమైన గాథలే కాక రాయడానికి వీల్లేని ఘోర గాయాలనూ చూసింది. దాదాపు అరవై శాతం వ్యథలకు కారణం ఇంటి సభ్యులే! మనసు చలించింది.. కలత చెందింది! అక్షరాలుగా పేరిస్తే ఒక్కరైనా స్పందించి ఆడబిడ్డ పట్ల సున్నితంగా ఆలోచిస్తారేమో అనిపించింది. అందుకే ఈ ప్రయత్నంతో ముందుకు వచ్చాం. ఆ ఒక్కరు ఇంకొకరిని.. ఆ ఇంకొకరు మరొకరిని ఇలా కనీసం కొంతమందైనా ప్రభావితమైతే.. ప్రయత్నం సఫలమైనట్టే! ఆడపిల్ల రక్షణకు అడుగు పడ్డట్లే! అలా బేటీ బచావో అనే ఈ కాలమ్‌కి మంచి ముగింపును ఆశిస్తున్నాం! సరస్వతి రమ -
అరబిందో ఆశ్రమంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య