
ముగ్గురు అక్కాచెల్లెళ్లు తుపాకులతో కాల్చేశారు
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 13 ఏళ్ల క్రితం దైవదూషణ చేసిన వ్యక్తిని తుపాకులతో కాల్చి చంపేశారు. అప్పట్లో తాము చిన్నపిల్లలు కావడంతో అతన్ని చంపలేకపోయామని, ఇప్పుడు శిక్ష విధించామని చెప్పారు.
2004లో ఫాజల్ అబ్బాస్ (45) అనే వ్యక్తి దైవదూషణ చేసినట్టు అక్కాచెల్లెళ్లు చెప్పారు. అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. కాగా పాకిస్థాన్ వీడి బెల్జియం వెళ్లిన అబ్బాస్ ఇటీవల స్వదేశం తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కాచెల్లెళ్లు అబ్బాస్ ఇంటికి వెళ్లారు. తాము అబ్బాస్‌ను కలవాలని ఆయన తండ్రితో చెప్పారు. ఇంట్లో నుంచి అబ్బాస్ బయటకు రాగానే బురఖాలో దాచిన తుపాకీలను తీసి ముగ్గురు అక్కాచెల్లెళ్లు సమీపం నుంచి అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. 13 ఏళ్ల తర్వాత తాము దైవదూషకుడికి శిక్ష విధించామని వారు నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో దైవదూషణ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ వారంలోనే పాక్‌లో మరో ఘటనలో మషాల్ ఖాన్ (23) అనే యువకుడి ఇలాంటి ఆరోపణలపైనే కొట్టి చంపారు.