![Three Sisters Give Birth to Three Babies on Same Day Same Hospital - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/07/14/three-babies.jpg.webp?itok=4MisqXCU)
వాషింగ్టన్ : ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేరోజున ఒకే హాస్పిటల్‌లో ప్రసవించిన ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం..దనీషా హేన్స్, ఏరియల్ విలియమ్స్, ఆష్లే హేన్స్ అనే అక్కాచెల్లెళ్లు ఈనెల 3న ఒకే ఆసుపత్రిలో కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో బిడ్డలకు జన్మనిచ్చినట్లు మాన్స్ఫీల్డ్ న్యూస్ జర్నల్ నివేదించింది. . 50 మిలియన్లలో ఎవరో ఒక్కరికి ఇలా జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ముగ్గురికీ డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఒకరే కావడం విశేషం. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించాడని తెలుస్తోంది.
ఇక ఒకేరోజు తమ బిడ్డలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని ముగ్గురు సోదరీమణులు పేర్కొన్నారు. మొదటగా విలియమ్స్ పురుడు పోసుకోగా పాపకు సిన్సిర్ అని పేరు పెట్టారు. ఈమె బరువు 8 పౌండ్లు ఉండగా, తదనంతరం ఆష్లే హేన్స్ ..అడ్రియన్ అనే కుమారుడికి జన్మనివ్వగా అతని బరువు 10 పౌండ్లు ఉంది. చివరగా ప్రసవించిన దనీషాకు పుట్టిన శిశువుకు ఎమ్రీ అని నామకరణం చేశారు. అందరికంటే ఈ చిన్నారి బరువు 14 పౌండ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవజాత శిశువుల బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై తల్లి డెబోరా వేర్ స్పందిస్తూ..ఇక మా పార్టీలో అదనంగా వేరే పిల్లలు ఉండరేమో అంటూ చమరత్కరించారు. (ఆ బాబు నిజంగానే మూడు కళ్లతో జన్మించాడా?)
Comments
Please login to add a commentAdd a comment