అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | Indian student Uma Satya Sai Gadde dies in Ohio | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Published Sat, Apr 6 2024 6:14 AM | Last Updated on Sat, Apr 6 2024 11:21 AM

Indian student Uma Satya Sai Gadde dies in Ohio - Sakshi

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

ఓహియో క్లీవ్‌లాండ్‌లో విద్యార్థి దుర్మరణం

ఈ ఏడాదిలో ఇప్పటికే ఇది 10వ మరణం

ఉమా సత్యసాయి గద్దె మృతిని ధృవీకరించిన భారతీయ రాయబార కార్యాలయం

మృతిపై రావాల్సిన స్పష్టత.. దర్యాప్తు జరుగుతున్నట్లు ప్రకటన

న్యూయార్క్‌: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొంది.

ఉమా సత్యసాయి గద్దె స్వస్థలం, ఇతర నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం. మరీ ముఖ్యంగా.. ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీ స్టూడెంట్‌ నీల్‌ ఆచార్య, జార్జియాలో వివేక్‌ సైనీ హత్య ఘటనలు షాక్‌కి గురి చేశాయి. అదే సమయంలో భారతీయ, భారత సంతతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు సైతం జరిగాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం సైతం ఈ ఘటనల్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement