cleveland
-
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఉమా సత్యసాయి గద్దె స్వస్థలం, ఇతర నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio. Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India. All possible assistance is being extended including to transport… — India in New York (@IndiainNewYork) April 5, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం. మరీ ముఖ్యంగా.. ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీ స్టూడెంట్ నీల్ ఆచార్య, జార్జియాలో వివేక్ సైనీ హత్య ఘటనలు షాక్‌కి గురి చేశాయి. అదే సమయంలో భారతీయ, భారత సంతతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు సైతం జరిగాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం సైతం ఈ ఘటనల్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. -
రన్నరప్ సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆదివారం అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సీజన్లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 7–6 (7/5), 6–2తో ఐకెరి (నార్వే) –కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను సానియా జంట నాలుగు సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ ముగిశాక తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి సానియా ఆనందం పంచుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహార (జపాన్) జోడీతో సానియా–క్రిస్టినా జంట తలపడుతుంది. -
డబుల్స్ సెమీస్‌లో సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెక్‌హాలే (అమెరికా) జంట సెమీఫైనల్లో ప్రవేశించింది. అమెరికాలోని ఒహాయోలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 6–3, 6–3తో మూడో సీడ్ లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్)–షుయె జాంగ్ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 61 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఐకెరి (నార్వే)–కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జంటతో సానియా–క్రిస్టినా జోడీ తలపడనుంది. -
బిల్లు 500.. టిప్పు 2 లక్షలు!
క్లీవ్‌లాండ్: ఓహియో రాష్ట్రం (అమెరికా) క్లీవ్‌లాండ్ నగరంలోని ఓ రెస్టరెంట్‌కు ఆదివారం ఒక కస్టమర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు 500 రూపాయలు) బిల్లుకి 3,000 డాలర్ల (సుమారు రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు. రెస్టరెంట్ యజమాని బ్రెండన్ రింగ్ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.. ‘‘ఓహియోలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రెస్టరెంట్‌ను స్వచ్ఛందంగా జనవరి వరకూ మూసివేయాలనుకున్నాం. చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టరెంట్ కిటకిటలాడుతూ ఉంది. అంతలో అప్పుడప్పుడు మా దగ్గరికొచ్చే ఒక కస్టమర్ లోపలికొచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్ ఆర్డర్ చేశాడు. రెండు సిప్పులు తాగిన తర్వాత ‘చెక్’ ఇమ్మన్నాడు. దాన్ని తీసుకుని రింగ్ టేబుల్ వద్దకొచ్చిన అతను బిల్లుతో పాటు రింగ్‌కు డబ్బులిస్తూ ‘‘గుడ్‌లక్. మళ్లీ కలుద్దాం!’’ అని వెళ్లిపోయాడు. ఆ బిల్లుపై టిప్పు ముందు 300 గా కనబడింది. కళ్లజోడు పెట్టుకున్నాక గానీ అది 3,000 అని తెలియలేదు. వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిసాను. ‘‘ఏమైనా పొరబడ్డారా?’’ అని అడిగాను. అందుకతను ‘‘లేదు. తెలిసే ఇచ్చాను. దాన్ని స్టాఫ్ అందరికీ పంచండి. మెరీ క్రిస్మస్’’ అన్నాడు. ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానని మొదట ఒక వెయిట్రెస్ నమ్మలేదు. ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉన్నారు. తలా 750 డాలర్లు ఇచ్చాను’’ అని వివరించాడు. అయితే తన పేరు బయటపెట్టొద్దని ఆ కస్టమర్ కోరాడని రింగ్ తెలిపాడు. ఈ సంఘటన పేపర్లో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన సోదరి కూడా ఈ విషయాన్ని పేపర్లో చదివిందని ఉత్సాహంగా చెప్పాడు రింగ్. ‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప కథలా కనిపిస్తుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. -
ప్లేన్ క్రాష్.. ప్రయాణికులంతా మృతి!
న్యూయార్క్: అమెరికాలో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమానం ఇరీ సరస్సులో కూలిపోవడంతో అందులోని వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. క్లీవ్‌లాండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని సిటీ అధికారులు శనివారం వెల్లడించారు. విమానంలో లిక్కర్ వ్యాపారి జాన్ ఫ్లెమింగ్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇరీ సరస్సులో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని మేయర్ ఫ్రాంక్ జాక్సన్ తెలిపారు. -
'గర్ల్‌ఫ్రెండ్‌కు కారు ఇచ్చి దాడికి వచ్చాడు'
క్లెవెలాండ్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో దూసుకెళుతున్న డోనాల్డ్ ట్రంప్‌పై దాడికి దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి ముందుగానే ప్రణాళిక రచించుకోని వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసిన తర్వాత విచారించగా తన దృష్టిలో ట్రంప్ ఓ జాతి వివక్ష పాటించే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ప్రసంగిస్తుంటే తన మైక్రోఫోన్ లాక్కునేందుకే స్టేజ్ వైపు దూసుకెళ్లాను తప్ప ఎవరికీ హానీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పినట్లు వెల్లడించారు. ఇటీవల ఒహాయోలోని డేటన్లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా థామస్ డిమస్సిమో అనే ఆందోళనకారుడు బారికేడ్లు దూకి వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకుని ట్రంప్‌కు రక్షణ కల్పించారు. ట్రంప్ అతనిపై నోరు పారేసుకున్నారు. ఆ వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి వివరాలు వెల్లడించారు. ట్రంప్ వైపు దూసుకురావడానికంటే ముందు అతడు తన కారు తాళాలు గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చి ఆమెను వెళ్లిపో అని చెప్పి మరీ వచ్చాడని పోలీసులు చెప్పారు. -
జాత్యహంకారం ఆనవాళ్లు
ఏళ్లు గడుస్తున్నాయి...తరాలు మారుతున్నాయి. కానీ, అమెరికాలో నల్లజాతి పౌరుల వేదన ఉపశమించడంలేదు. వారి క్షతగాత్ర హృదయాలు సాధారణ స్థితికి చేరడం లేదు. రెండురోజుల వ్యవధిలో అక్కడ జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు ఆ గాయాలను మళ్లీ రేపాయి. వారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం మరోసారి భళ్లున బద్దలయింది. తొలి ఘటన ఒహాయోలోని క్లీవ్‌లాండ్ సిటీలో జరిగింది. అక్కడి పోలీసులు ఒక ఆటస్థలంలో బొమ్మ తుపాకితో ఆడుకుంటున్న పన్నెండేళ్ల ఆఫ్రికన్ అమెరికన్ బాలుడు టామిర్ రైస్‌ను కాల్చిచంపారు. మిస్సోరిలోని ఫెర్గ్యుసన్ సిటీలో మూడు నెలలక్రితం నిరాయుధుడైన పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడు మైకేల్ బ్రౌన్‌ను ఒక కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటనపై తీర్పు వెలువడే ముందురోజే ఇది చోటుచేసుకుంది. తీర్పు నల్లజాతి పౌరులకు ఆగ్రహం కలిగించే పక్షంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చునన్న ఉద్దేశంతో పోలీసు బలగాలను మోహరించిన సమయంలోనే టామిర్ రైస్ అకారణంగా, అన్యాయంగా బలైపోయాడు. ఆ ఉదంతం ఆగ్రహావేశాలను రగిలిస్తున్న క్షణాల్లోనే ఫెర్గ్యుసన్ ఘటనలో కానిస్టేబుల్ నిర్దోషి అని తీర్పు వెలువడింది. ఫలితంగా షికాగో, లాస్ఏంజెలస్, న్యూయార్క్ నగరాల్లో, మిస్సోరి రాష్ట్రంలో నల్లజాతి పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. పలుచోట్ల భవనాలకు, కార్లకు నిప్పంటించారు. అనేక దుకాణాల్లో లూటీలు జరిగాయి. ఒక సమాజాన్ని ఆధునికమైన, నాగరికమైన సమాజంగా పరిగణించడానికి అక్కడున్న ఆకాశాన్నంటే భవంతులు, వినియోగంలో ఉండే అత్యాధునిక ఉపకరణాలు గీటురాయి కాదు. తోటి మనిషిని గౌరవించేపాటి కనీస విలువను ఇంకా నేర్చుకోని సమాజం నాగరికమైనదని అనిపించుకోలేదు. క్లీవ్‌లాండ్ ఉదంతంలో అక్కడి పోలీసుల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడి ప్లేగ్రౌండ్‌లో ఒక బాలుడు తుపాకితో ఆడుకుంటున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు అక్కడికెళ్లారు. అతన్ని చేతులు పెకైత్తి లొంగిపొమ్మని హెచ్చరించారు. ఆ పిల్లవాడు పోలీసులను చూసి దూషించలేదు. బెదిరించలేదు. అప్పటికే తన జేబులో ఉన్న తుపాకిని బయటకు తీయబోయాడంతే! వెనువెంటనే ఒక కానిస్టేబుల్ బాలుడిపైకి గుళ్లవర్షం కురిపించాడు. బాలుడి ప్రాణం పోయాక సోదా చేస్తే అది బొమ్మ తుపాకి అని తేలింది. బాలుడిపై ఫోన్లో ఫిర్యాదు చేసినవారు అది బొమ్మ తుపాకి అయివుండొచ్చని కూడా పోలీసులకు చెప్పినట్టు ఇప్పుడు వెల్లడైంది. ఆ బాలుడు నల్లజాతికి చెందినవాడు కాకపోతే బహుశా ఆ కానిస్టేబుల్ వేరే పద్ధతిలో వ్యవహరించేవాడేమో! మూడు నెలలనాటి ఫెర్గ్యుసన్ ఘటన కూడా ఇంతే చిత్రమైనది. మైకేల్ బ్రౌన్ ఫుట్‌పాత్‌పైన కాక రోడ్డుమీద నడిచాడు. ఎలాంటి ఆయుధమూ లేకుండా సంచరిస్తున్న అతని గురించి ఫిర్యాదు వచ్చీరాగానే పోలీసులు తుపాకులు చుట్టుముట్టి హడావుడి చేశారు. మైకేల్ బ్రౌన్ కాసేపు వాదనకు దిగాడుగానీ చివరకు చేతులు రెండూ తలపై పెట్టుకుని లొంగుబాటును ప్రకటించబోయాడు. ఈలోగానే కానిస్టేబుల్ అతన్ని కాల్చిచంపేశాడు. ఈ విషయంలో కానిస్టేబుల్‌పై ఎలాంటి నేరారోపణ చేయకుండా విడిచిపెడుతున్నట్టు సెయింట్ లూయీ కౌంటీ కోర్టు తీర్పు వెలువరించింది. ‘నిరాశకు గురైనవారెవరైనా, ఏమైనా అనొచ్చు. కానీ, నేర న్యాయవ్యవస్థలో నిర్ణయాలు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన సాక్ష్యాల ఆధారంగానే ఉంటాయి’ అని ప్రాసిక్యూటర్ మెకాలక్ అంటున్నాడు. నిరాయుధుడిగా, ఆ క్షణం వరకూ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉన్న యువకుణ్ణి కాల్చిచంపడంలో తప్పేమీ లేదన్న నిర్ణయానికి కారణమైన ఆ సాక్ష్యాల్లోని శాస్త్రీయత, విశ్వసనీయత ఏపాటి? జరిగిన హత్య నేరం కాదని చెప్పడానికి వందరోజులు పట్టిందన్నమాట! అమెరికా సమాజంలో ఇంకా అంతర్గతంగా, బాహాటంగా కొనసాగుతున్న జాత్యహంకారానికి ఈ రెండు ఘటనలూ ఆనవాళ్లు. అప్పుడు బ్రౌన్ అయినా, ఇప్పుడు టామిర్ రైస్ అయినా ఆ అహంకారానికి బలైపోయారు. నల్లవాళ్లంతా నేరస్తులే కావొచ్చునని, వారిపై చిన్నపాటి అనుమానం కలిగినా ప్రాణాలు తీయడంతో సహా ఏమైనా చేయొచ్చునని పోలీసుల శిక్షణలో నేరుగా ఉండకపోవచ్చు. కానీ, పోలీసు వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో ఉండే శ్వేతజాతీయుల్లో నల్లజాతీయులపై నరనరానా వ్యతిరేకత జీర్ణించుకొని ఉన్నదని పదే పదే రుజువవుతున్నది. దీన్ని సరిదిద్దలేని అక్కడి వ్యవస్థ ఈ నేరం కొనసాగడానికి తోడ్పడుతున్నది. నల్లజాతీయులు ప్రతి ముగ్గురిలో ఒకరు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారయినా జైలు కెళ్లడమో, పోలీస్‌స్టేషన్ మెట్లెక్కడమో, కేసుల్లో చిక్కుకోవడమో తప్పడం లేదని ఒక సర్వే చెబుతున్నది. బ్రౌన్కూ, టామిర్ రైస్‌కూ మధ్య ఈ మూడు నెలలకాలంలో పోలీసుల చేతుల్లో మరణించిన నల్లజాతి పౌరులు 20కి మించి ఉన్నారని నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడే సంస్థ అంటున్నది. తమ కుమారుడి మరణానికి తల్లడిల్లుతున్న నల్లజాతి హృదయావేదనను అర్ధం చేసుకోగలం గానీ హింసాకాండకు పాల్పడి అతని స్మృతికి కళంకం తేవొద్దని బ్రౌన్ తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. దేశంపట్లా, సమాజంపట్లా వారికున్నపాటి బాధ్యతనైనా అధికార యంత్రాంగం చూపలేకపోతే భవిష్యత్తరాలకు అది అన్యాయం చేసినట్టే అవుతుంది. అమెరికాలో సమాన హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూధర్‌కింగ్ జూనియర్ తన చారిత్రక ప్రసంగంలో ‘నాకున్న నలుగురు చిన్నారుల్నీ వారి శరీరం రంగును బట్టికాక...వారి ప్రవర్తన సరళినిబట్టి నిర్ణయించే రోజొకటి వస్తుందన్నది నా స్వప్నం. అది నిజమయ్యే రోజొకటి వస్తుందని నా ఆశ’ అన్నాడు. 1963 నాటి మార్టిన్ లూధర్‌కింగ్ కలలుగన్న స్వప్నానికి తాను ఎంత దూరంలో ఉన్నదీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఇప్పుడు అమెరికా సమాజమే. -
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!
న్యూయార్క్: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమీ లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. లాస్ ఏంజిల్స్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్లాండ్, డెల్వుడ్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రజలు సంయమనం పాటించాలని అధ్యక్షుడు ఒబామా విజ్ఞప్తి చేశారు. అమెరికాలో బొమ్మ తుపాకి కలిగి ఉన్న 12 ఏళ్ల బాలుడు తమిర్ రైస్‌ను క్లైవ్లాండ్ పోలీసులు ఈ నెల 22 శనివారం కాల్చారు. 23న మృతి చెందాడు. అసలు తుపాకీ అనుకొని కాల్చామని ఆ పోలీసులు తాపీగా చెప్పారు. పోలీసుల అత్యుత్సాహంపై అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిర్ రైస్‌ను పోలీసులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. గ్రౌండ్లో తమిర్ జనాల వైపు బొమ్మ తుపాకీని చూపిస్తూ సరదగా ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో పోలీసులకు చెందిన 911 నెంబర్‌కు ఫోన్ చేశారు. గ్రౌండ్‌కు వచ్చిన పోలీసులు బాలుడు తన ప్యాంట్లో నుంచి మాటి మాటికీ గన్‌తీసి పెడుతుండటం చూశారు. అయితే అతడి చేతిలో ఉన్న గన్ ఒరిజినలా, డూప్లికేటా అన్నది మాత్రం ఆలోచించలేదు. వచ్చీ రాగానే తమిర్‌ను లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. చేతులు ఎత్తాలని హెచ్చరించినా వినిపించుకోవడం లేదంటూ కాల్పులు జరిపారు. గాయాలతో విలవిలలాడుతూ కిందపడిపోయిన తమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం చనిపోయాడు. బాలుడి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలకలం రేపిన ఈ ఘటన అగ్రరాజ్యంలో అభద్రతా భావాన్ని వెల్లడిస్తోంది. **