న్యూయార్క్: అమెరికాలో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమానం ఇరీ సరస్సులో కూలిపోవడంతో అందులోని వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
క్లీవ్లాండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని సిటీ అధికారులు శనివారం వెల్లడించారు. విమానంలో లిక్కర్ వ్యాపారి జాన్ ఫ్లెమింగ్తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇరీ సరస్సులో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని మేయర్ ఫ్రాంక్ జాక్సన్ తెలిపారు.
ప్లేన్ క్రాష్.. ప్రయాణికులంతా మృతి!
Published Sun, Jan 1 2017 9:20 AM | Last Updated on Tue, Nov 6 2018 4:38 PM
Advertisement
Advertisement