అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి | Six reported dead after fiery plane crash in Virginia | Sakshi
Sakshi News home page

అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి

Published Sat, Aug 13 2016 9:05 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి - Sakshi

అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి

వర్జీనియా: అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని షన్నన్ విమానాశ్రయంలో ఓ చిన్న ప్రైవేటు విమానం కూలి ఆరుగురు మృతి చెందారు. విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ టేక్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. రన్ వే దక్షిణ చివరన ఉన్న చెట్లపై విమానం ల్యాండ్ అయిందని, విమానం చెట్లపై పడగానే వెంటనే మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు.

మృతదేహాలను బయటకు తీశామని, మృతుల వివరాలు తెలియరాలేదన్నారు. కేసును ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement