సాక్షి, గుంటూరు : ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment