
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెక్‌హాలే (అమెరికా) జంట సెమీఫైనల్లో ప్రవేశించింది. అమెరికాలోని ఒహాయోలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 6–3, 6–3తో మూడో సీడ్ లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్)–షుయె జాంగ్ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 61 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఐకెరి (నార్వే)–కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జంటతో సానియా–క్రిస్టినా జోడీ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment