
Adelaide Open 2023: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సంవత్సరాన్ని ఓటమితో ప్రారంభించింది. సోమవారం మొదలైన అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 టోర్నీలో సానియా మీర్జా–అనా డానిలినా (కజకిస్తాన్) జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
సానియా–డానిలినా ద్వయం 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టిన సానియా– డానిలినా జోడీకి 4,350 డాలర్ల (రూ. 3 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.