
Adelaide Open: కొత్త ఏడాదిలో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అడిలైడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా (భారత్)–నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. యాష్లే బార్టీ–స్టార్మ్ సాండెర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో సానియా–కిచెనోక్ 1–6, 6–2, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి చవిచూశారు.
సెమీస్‌లో బోపన్న ద్వయం
మరోవైపు అడిలైడ్ ఓపెన్ పురుషుల టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ (భారత్) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్6–1, 6–3తో బోంజి (ఫ్రాన్స్)–హుగో నిస్ (మొనాకో)లపై నెగ్గారు.
చదవండి: SA vs IND: "కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు"
Comments
Please login to add a commentAdd a comment