Telugu students killed
-
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఉమా సత్యసాయి గద్దె స్వస్థలం, ఇతర నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio. Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India. All possible assistance is being extended including to transport… — India in New York (@IndiainNewYork) April 5, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం. మరీ ముఖ్యంగా.. ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీ స్టూడెంట్ నీల్ ఆచార్య, జార్జియాలో వివేక్ సైనీ హత్య ఘటనలు షాక్‌కి గురి చేశాయి. అదే సమయంలో భారతీయ, భారత సంతతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు సైతం జరిగాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం సైతం ఈ ఘటనల్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. -
అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!
గత రెండు మూడేళ్లుగా అమెరికాలో జరుగుతున్న యాక్సిడెంట్లలో తెలుగు విద్యార్థులే ఎక్కువ బాధితులవుతున్నారు. ఎన్నో ఆశలతో, ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వచ్చి అనూహ్యంగా అందరికీ దూరమవుతున్నారు. ఇదీ వారి ప్రాణాలకు సంబంధించినదొక్కటే కాదు, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను అమెరికా పంపించిన తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు జీవిత కాలం సరిపడా ఆవేదన మిగిలిపోతోంది. అగ్రరాజ్యానికి వెళ్లేవారిలో అగ్రవాటా మనదే ప్రతీ ఏటా అమెరికా వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువ. అమెరికాలో ఉన్నత చదువులు, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల కోసం మనవాళ్లు ఎక్కువగా వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి MS కోసం వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వీసాను F1 అంటారు. ప్రతీ ఏటా దాదాపు 75వేలకు పైగా జారీ చేస్తారు. 2022లో 82వేల F1 వీసాలిచ్చారు. F1 వీసా అయిదేళ్లు అమెరికాలో ఉండే అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది F1 వీసా దక్కించుకున్న తెలుగు విద్యార్థులు ఏకంగా 58 వేలు. లెఫ్ట్ వర్సెస్ రైట్ అమెరికా జాగ్రఫీ కొంత విభిన్నంగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా.. చాలా చోట్లకు వెళ్లడం కష్టం. పైగా ఒక టౌన్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి చాలా చాలా దూరం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల బైక్‌లు వాడడం చాలా కష్టం. ముఖ్యంగా చలికాలంలో బయటకు రాలేం. అందుకే కారు తప్పనిసరి. అయితే భారత్‌తో పోలిస్తే రెండు ప్రధానమైన తేడాలు కనిపిస్తాయి. ఒకటి ఇండియా రైట్ సైడ్ డ్రైవింగ్. కానీ అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. అంటే స్టీరింగ్ గానీ, రోడ్ టర్నింగ్ గానీ లెఫ్ట్ వైపు ఉంటుంది. ఎక్కడ తేడా కొడుతోంది? అమెరికా వచ్చే తెలుగు విద్యార్థుల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తప్పు చేస్తారు. ఇండియా నుంచి వచ్చేప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటారు. ఇది కారు నడిపే అవకాశం ఇస్తుంది కానీ, చట్టపరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎలాంటి విలువ లేదు. అమెరికాలోనే అక్కడి పరిస్థితుల మధ్య శిక్షణ తీసుకుని అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటేనే దానికి విలువ, చట్టపరంగా గుర్తింపు. ఇండియన్ లైసెన్స్‌తో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ సున్న. కొంప ముంచుతున్న వేగం అమెరికా రోడ్లు మనతో పోలిస్తే చాలా పెద్దవి. పైగా మన ఔటర్ రింగ్‌రోడ్డుకు రెట్టింపు పెద్దగా... దేని లేన్‌లో అవి వెళ్తుంటాయి. భారీ ట్రక్కులు, కంటెయినర్లు కూడా కార్లతో సమానంగా దూసుకెళ్తుంటాయి. రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి వేగంలో ఏ ఒక్కరు రాజీ పడరు. ఇక్కడే తేడా వస్తోంది. రోడ్డుపై ఎక్కడ తేడా వచ్చినా.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆటోమెటిక్ కార్లు, వంద మైళ్లకు తగ్గకుండా స్పీడ్‌తో మన వాళ్లు దూసుకుపోతున్నారు సరే, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. అనుభవం అవశ్యకం అమెరికా గురించి ఎంత తెలిసినా.. రోడ్డుపై డ్రైవింగ్ చేసిన అనుభవం తప్పకుండా కావాలి. ముందు టౌన్లలో కొన్నాళ్లు, ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లలో కొన్నాళ్లు నడిపిన తర్వాతే మెయిన్‌లోకి రావాలి. మనవాళ్లు తరచుగా వచ్చిన కొద్దిరోజులకే మెయిన్ రోడ్డు ఎక్కేస్తున్నారు. అనుభవలేమి వల్ల ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ లేదా యాపిల్ మ్యాప్‌ల మీద ఆధారపడడం వల్ల డ్రైవింగ్‌పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ట్రక్కులు నిలిచిపోయినా.. లేక అదుపు తప్పినా.. తిరిగి గాడిన పెట్టలేని దుస్థితి. విద్యార్థులు తొందర పడొద్దు- రత్నాకర్ అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.సాక్రెడ్ హర్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అనూహ్యంగా యాక్సిడెంట్‌కు గురయి చనిపోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగినపుడు చాలా బాధ కలుగుతుంది. ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ వేరు, అమెరికాలో వేరు. కార్లు చాలా వేగంగా నడుపుతారు. కొత్తగా వచ్చే విద్యార్థులు డ్రైవింగ్ అనుభవం లేకుండా కారు నడపొద్దు. రత్నాకర్, నార్త్ అమెరికా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి -
యూఎస్‌లో కారు ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థుల దుర్మరణం
రామగిరి(నల్లగొండ)/వరంగల్ చౌరస్తా/కడియం: ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ముగ్గురు తెలుగు విద్యార్థులు రెండు నెలల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొనడంతో ముగ్గు రూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26)తో పాటు వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన ఎంఎస్ విద్యార్థిని గుళ్లపెల్లి పావని (22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన పాటంశెట్టి సాయి నరసింహ (25) ఉన్నారు. గోదోరిగూడేనికి చెందిన లక్ష్మారెడ్డి, లలిత దంపతు ల పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్ అమెరికాలోని న్యూ యార్క్ సాక్రెడ్‌హార్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతు న్నారు. ఆగస్టు 23న అమెరికాకు వెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం స్నేహితులతో కలిసి ప్రేమ్‌కుమార్ విహారయా త్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. దట్టమైన మంచు కురుస్తుండటంతో సరిగా కనిపించక ఎదురుగా వస్తు న్న ట్రక్కును వీరి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఏడుగురి లో ప్రేమ్‌కుమార్, పావని, సాయి నరసింహ అక్కడికక్కడే మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామ న్నపేట మండలం వెల్లంకి గ్రా మానికి చెందిన మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. చదువు కోసం అమెరికా వెళ్లి రెండు నెలలు గడవక ముందే ప్రేమ్ మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, అమెరికా నుంచి మృతదేహాలను తీసుకురావడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. స్వదేశానికి రావడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. కొద్ది నెలల కిందటే అమెరికాకు.. గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేశ్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రమేశ్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. పావని ఎంఎస్సీ కోసం రెండు నెలల కిందట అమెరికా వెళ్లింది. పావని దీపావళి రోజు కుటుంబ సభ్యులతో మొబైల్ ఫోన్లో మాట్లాడినట్లు బంధువులు తెలిపారు. కాగా, బుర్రిలంకకు చెందిన సాయి నరసింహ 3 నెలల క్రితమే ఎంఎస్ చదివేందుకు యూఎస్ వెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన ఐశ్వర్య ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతోంది. -
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు. -
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, అమరావతి/ సింధనూరు టౌన్: అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు పోస్టల్‌కాలనీకి చెందిన చెన్నారెడ్డి కేదార్నాథ్.. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం 21 రోజుల కిందట అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌కు వెళ్లాడు. ఇటీవల ఓ సరస్సులో ఈతకోసం దిగి బయటకు రాలేక ప్రాణాలు విడిచాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకొచ్చింది. నేడో, రేపో కేదార్నాథ్ మృతదేహం నెల్లూరుకు రానున్నట్టు సమాచారం. అలాగే కర్ణాటకలో కొప్పళ జిల్లా సింధూనూరు తాలూకాలోని శ్రీపురం జంక్షన్‌కు చెందిన కొయ్యలముడి శ్రీనివాస్ చాలా ఏళ్ల కిందటే ఏపీ నుంచి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు అజయ్‌కుమార్(24) అమెరికాలోని ఆర్లింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్ (ఇంజినీరింగ్) చదువుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టర్నర్‌ఫాల్స్‌ను చూసేందుకు వెళ్లిన సమయంలో ఓ స్నేహితుడు నీటిలోకి జారిపడ్డాడు. అతన్ని రక్షించేందుకు అజయ్‌కుమార్ విఫలయత్నం చేసి.. అతనితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది. -
జర్మనీలో తెలుగు విద్యార్థుల మృతి
- బీచ్‌లో ఈత కొడుతుండగా ఇద్దరికి ప్రమాదం - మృతులు ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లా వాసులు నల్లజర్ల (పశ్చిమగోదావరి)/కొండపి: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన ఇద్దరు ఆంధ్రా యువకులు ఆదివారం బీచ్‌లో ఈత కొడుతూ మునిగి చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం విద్యార్థి దండమూడి ఉదయ నాగమణిశంకర్ (22), ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టావారిపాలెంకు చెందిన మల్లికార్జున (21) ఈ ప్రమాదంలో మృతి చెందారు. తోటి స్నేహితులు నలుగురితో కలసి వీరిద్దరూ ఆదివారం సిల్బర్సీటూ హెల్టర్నామ్సీ ప్రాంతంలో బీచ్‌కు వెళ్లారు. అందులో ఇద్దరు ఒడ్డున స్నాక్స్ తింటుండగా మరో ఇద్దరు నీళ్లలోకి కొద్ది దూరం వెళ్లి భయంతో ఆగిపోయారు. నాగమణిశంకర్, కట్టా మల్లిఖార్జున మరికొంచెం లోపలకు వెళ్లి ఈత కొడుతుండగా అలల తాకిడికి మునిగిపోయినట్టు తోటి స్నేహితులు ఇక్కడి కి సమాచారం అందించారు. ఒక్కగానొక్క కుమారుడు.. వెంటరత్నం, లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు నాగమణిశంకర్ ఏప్రిల్ నెలాఖరులో ఎంఎస్ చదవడానికి జర్మనీ వెళ్లాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రమాదంలో అసువులుబాయటంతో ఆ దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. జర్మనీ వెళ్లినప్పటి నుంచి స్నేహంగా ఉంటున్న మల్లికార్జున, నాగమణిశంకర్ చావులోనూ వెన్నంటే ఉన్నారు.