same day
-
ఈసీ షెడ్యూల్.. వైఎస్సార్సీపీ కోరిందే జరిగింది
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఆ వినతుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్‌సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్సీపీ సిద్ధం -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట
వాషింగ్టన్ : ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేరోజున ఒకే హాస్పిటల్లో ప్రసవించిన ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం..దనీషా హేన్స్, ఏరియల్ విలియమ్స్, ఆష్లే హేన్స్ అనే అక్కాచెల్లెళ్లు ఈనెల 3న ఒకే ఆసుపత్రిలో కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో బిడ్డలకు జన్మనిచ్చినట్లు మాన్స్ఫీల్డ్ న్యూస్ జర్నల్ నివేదించింది. . 50 మిలియన్లలో ఎవరో ఒక్కరికి ఇలా జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ముగ్గురికీ డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఒకరే కావడం విశేషం. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించాడని తెలుస్తోంది. ఇక ఒకేరోజు తమ బిడ్డలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని ముగ్గురు సోదరీమణులు పేర్కొన్నారు. మొదటగా విలియమ్స్ పురుడు పోసుకోగా పాపకు సిన్సిర్ అని పేరు పెట్టారు. ఈమె బరువు 8 పౌండ్లు ఉండగా, తదనంతరం ఆష్లే హేన్స్ ..అడ్రియన్ అనే కుమారుడికి జన్మనివ్వగా అతని బరువు 10 పౌండ్లు ఉంది. చివరగా ప్రసవించిన దనీషాకు పుట్టిన శిశువుకు ఎమ్రీ అని నామకరణం చేశారు. అందరికంటే ఈ చిన్నారి బరువు 14 పౌండ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవజాత శిశువుల బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై తల్లి డెబోరా వేర్ స్పందిస్తూ..ఇక మా పార్టీలో అదనంగా వేరే పిల్లలు ఉండరేమో అంటూ చమరత్కరించారు. (ఆ బాబు నిజంగానే మూడు కళ్లతో జన్మించాడా?) -
ఒకే రోజు నాలుగు ‘పరీక్ష’లు
► 23న రాష్ట్ర పోలీసు, సీఆర్పీఎఫ్, సీడీఎస్, ఐబీపీఎస్ పరీక్షలు ► పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదాకు అభ్యర్థుల విజ్ఞప్తులు సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నాలుగు వేర్వేరు ఉద్యోగాల రాత పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రెండు, అంతకంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలోని పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జరగనుంది. అదే రోజు సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ రాత పరీక్ష ఉదయం 8-11 గంటల మధ్య జరగనుండగా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్ష ఉదయం 9-12 గంటలకు, ఐబీపీఎస్ పీఓ/ఎంటీ రాత పరీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షకు హాల్‌టికెట్లు పొందిన అభ్యర్థులు.. సీఆర్పీఎఫ్, ఐబీపీఎస్, సీడీఎస్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని కొందరు అభ్యర్థులు పేర్కొన్నారు.