అదే రోజు సెటిల్‌మెంట్‌ | SEBI to move to instant settlement is Same day | Sakshi
Sakshi News home page

అదే రోజు సెటిల్‌మెంట్‌

Published Sat, Dec 23 2023 5:41 AM | Last Updated on Sat, Dec 23 2023 5:41 AM

SEBI to move to instant settlement is Same day - Sakshi

న్యూఢిల్లీ: ట్రేడ్‌ చేసిన రోజే సెటిల్‌మెంట్‌ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్‌మెంట్‌ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్‌ టైమ్‌) సెటిల్‌మెంట్‌ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్‌1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్‌ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్‌మెంట్‌ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు.

టీప్లస్‌1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్‌2 విధానం ఉండేది. టీప్లస్‌5 స్థానంలో టీప్లస్‌3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్‌2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్‌మెంట్‌ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది.  

ఐచ్ఛికంగా..
సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్‌మెంట్‌కు టీప్లస్‌0, ఇన్‌స్టంట్‌ సెటిల్‌మెంట్‌ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్‌1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్‌మెంట్‌ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది.

నిజానికి ఇన్వెస్టర్‌ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్‌మెంట్‌ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఆందోళనలు..  
‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్‌ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్‌0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్‌0, టీప్లస్‌1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్‌ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది.

రెండు దశల్లో
మొదటి దశలో టీప్లస్‌0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్‌స్టంట్‌ ట్రేడ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement