న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్‌సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్‌ఎస్‌ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్‌సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి.
2021 ఫిబ్రవరి 24న ఎన్‌ఎస్‌ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్‌లైన్ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్‌తోపాటు సెటిల్‌మెంట్ బాధ్యతలను ఎన్‌సీఎల్ నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment