Glitches
-
రష్యాలో స్తంభించిన యూట్యూబ్.. యూజర్ల గగ్గోలు
వీడియో హోస్టింగ్ సైట్ యూట్యూబ్‌లో ప్రపంచంలో ఎక్కోడో చోట అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం రష్యాలో యూట్యూబ్ సేవలు స్తంభించాయి. దీంతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. యూట్యూబ్ లభ్యతలో వేలాది అవాంతరాలను రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీసెస్ కూడా నివేదించింది.రష్యాలో యూట్యూబ్‌కు సంబంధించి వేలకొద్దీ అవాంతరాలు నమోదయ్యాయని రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీస్ Sboi.rf తెలిపింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల (VPNలు) ద్వారా మాత్రమే యూట్యూబ్‌ని యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతోందని యూజర్లు పేర్కొన్నారు.రష్యాలోని రాయిటర్స్ రిపోర్టర్లు కూడా యూట్యూబ్‌ని యాక్సెస్ చేయలేకపోయారు. అయితే కొన్ని మొబైల్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. యుట్యూబ్ డౌన్లోడ్ వేగం ఇటీవల గణనీయంగా తగ్గింది. యూట్యూబ్ అంతరాయంపై దాని యజమాన్య సంస్థ ఆల్ఫాబెట్‌ను రష్యన్ చట్టసభ సభ్యులు నిందించారు. -
మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
-
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
ఆ యాప్ ద్వారా ఫ్రీ ఫుడ్, మందు.. క్షణాల్లోనే వందల ఆర్డర్స్
వాషింగ్టన్: ఆఫర్లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్ ద్వారా ఉచితంగా ఫుడ్, లిక్కర్ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్‌డాష్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్‌లో పేమెంట్ గేట్‌వే లేకుండానే ఆర్డర్లు బుక్కయ్యాయి. ఈ ఆఫర్ తెలుసుకున్న పలువురు ఆర్డర్ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్‌డాష్ యాప్ ట్విట్టర్లో ట్రెడింగ్‌లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్ లేకుండా ఆర్డర్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్‌డాష్ యాప్‌లో పేమెంట్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్ బుక్ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్‌డాష్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL — annabelle. (@oomfabelle) July 8, 2022 Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj — Follow Da Realest (@Cameron_773) July 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
యూజర్ ఫ్రెండ్లీ అంటూ గొప్పలు.. ప్రజలకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: కాగిత రహిత పాలనలో తమను మించిన వారు లేరని, అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా మారింది. అన్నీ ఆన్లైన్ ద్వారానే అని చెబుతున్నప్పటికీ.. సవ్యంగా పనిచేయాల్సిన జీహెచ్ఎంసీ సర్వరే మొరాయిస్తుండటంతో వివిధ పనులు అవసరమైన వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ సేవలకు సంబంధించి ఇదివరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సదుపాయం ఉండేది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు, ట్రేడ్‌లైసెన్సుల వంటి సేవలందేవి. ఇటీవలి కాలంలో ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే సదరు సేవలు వినియోగించుకునేలా చేశారు. జీహెచ్ఎంసీలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు అధికారులను కలిసే పనే లేకుండా యూజర్‌ఫ్రెండ్లీగా ఆన్లైన్ ద్వారానే ఈ సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ప్రజలకు అంతరాయాల్లేకుండా సేవలందుతున్నాయా.. సాంకేతికంగా ఇబ్బందులెదురవుతున్నాయా ? వంటి విషయాలను మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలతో పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా సైతం అదే పరిస్థితని చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్లు ఆటోమేటిక్‌గా జరుగుతున్నప్పటికీ, పాతవాటికి సంబంధించి ఇబ్బందులెదురవుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనుకునేవారికీ ఇదే పరిస్థితి. ఇక టౌన్‌ప్లానింగ్‌లో అన్నీ ఆన్లైనే అని చెబుతున్నప్పటికీ, అధికారులను మచ్చిక చేసుకోకపోతే పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఇల్లు కుట్టుకున్న వారి ఆస్తిపన్నుకు సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ నుంచి దుకాణదారుల ట్రేడ్‌లైసెన్సుల వరకు అన్నీ ఆన్లైన్లోనే సదుపాయం కల్పించినప్పటికీ, తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకొని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలుండవని హిమాయత్‌నగర్‌కు చెందిన రాకేశ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉన్నతాధికారులు చేపట్టిన ‘ఆన్లైన్ మంత్ర’ వల్ల తమకు రావాల్సిన పై ఆదాయం రానందున జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగులే సమస్యలు సృష్టిస్తున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం వినియోగం సైతం పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు) ఆన్లైన్ సేవలు.. ► సెల్ఫ్ అసెస్మెంట్స్ ► మ్యుటేషన్స్ ► బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ► ట్రేడ్ లైసెన్స్ నెలల తరబడి తిప్పుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మ్యుటేషన్ జరుగు తుందని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. సర్వర్‌డౌన్ పేరిట నెలల తరబడి తిప్ప డం సమంజసం కాదు. లోపాలెక్కడున్నాయో పరిశీలించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలి. – లక్ష్మణ్, ఉప్పల్ -
ఆన్లైన్లో ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా? ఎదురయ్యే ఇబ్బందులు.. పరిష్కారాలు
మేము ఐటీఆర్ ఫారం ఆన్లైన్లో వేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలి? – హసిత, వినీత, హైదరాబాద్ చాలా మంది సైటుకి వెళ్లి ఆన్లైన్లో రిటర్నులు వేద్దామని మొదలెడితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు, ఫారం1ను పోర్టల్‌లో నింపినప్పుడు అన్ని వివరాలు పొందుపర్చాకా ఆ సమాచారం మాయం అవుతోంది. దీనివల్ల మళ్లీ పని చేయాలి. లాగ్అవుట్ అయ్యి, మళ్లీ లాగిన్ కావాలి. అక్కణ్నుంచి మళ్లీ కథ మొదలు. ఒక్కొక్కప్పుడు తొలిసారే సమాచారం సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాతే రిటర్నులను దాఖలు చేయగలరు. అలాగే ఐటీఆర్ 2ని నింపినప్పుడు ’క్యాపిటల్ గెయిన్ సమాచారం’. ఆన్లైన్లో నింపే విధానంలో ప్రతి పేజి మీదా షెడ్యూల్ లేదా పట్టిక మీదా క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించిన సమాచారం ’వేలిడేట్’ (అంటే సమాచారాన్ని చెక్ చేసుకుని, అవునని నిర్ధారించడం) అవడం లేదు. అంటే కన్ఫర్మ్ కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి వాటి వల్ల చేసిందే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుండటం, జాప్యం వల్ల సమయం వృ«థా కావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ తప్పదు. వీటితో పాటు ముందుకు సాగాల్సిందే. కొందరు ఐటీ రిటర్నులను ఆన్లైన్లో వేయలేకపోతున్నారు. ఆఫ్‌లైన్‌లో నింపి ఆన్లైన్లో వేయవచ్చా? – రిద్ధి, రిత్విక్, విశాఖపట్నం ఇక్కడ కొంత అవగాహన ఏర్పడాలి. ఆదాయాన్ని బట్టి, స్టేటస్‌ను బట్టి రకరకాల ఫారాలు ఉన్నాయి. అన్ని ఫారాలు ఆన్లైన్లో లాగిన్ అయ్యి, ఒక్కొక్క సమాచారాన్ని నింపుకుంటూ, వేలిడేట్ చేసుకుంటూ ఫైల్ చేస్తారు. సవ్యంగా, ఏ ఆటంకాలు లేకుండా ఉంటే ఇది సులువుగాను, వేగంగానూ పూర్తవుతుంది. కొన్ని విభాగాల వారికి .. అంటే ట్రస్టులు, సొసైటీలు, కంపెనీలు మొదలైన వాటికి డైరెక్టుగా నింపడం ఇంకా రాలేదు. వీటిని కంప్యూటర్ సహాయంతో ఆఫ్‌లైన్‌లో, వాడుకలో ఉన్న ’యుటిలిటీ’ ద్వారా నింపాలి. 5,6,7 ఫారాలు ఎక్సెల్ యుటిలిటీ ద్వారా నింపిన తర్వాత ’JSON’ ఫైల్ (జావా ఫైల్) ద్వారా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ’అప్లోడ్’ చేయాలి. ఇది కూడా త్వరగానే అవుతుంది. 1,2,3,4 ఫారాలు ఆన్లైన్లోనే డైరెక్టుగా వేయవచ్చు. ఫారం 26 అ తో పాటు అఐ కూడా డౌన్లోడ్ చేసుకుని రిటర్న్ వేయాలా? – భాను, సుమంత్, వరంగల్ రిటర్నులు వేసే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్‌కం తయారు చేసుకోండి. ఫారం 26 అ లో అంశాలు తీసుకోండి. కొన్ని రోజుల క్రితం అఐ వచ్చింది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS )లో ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే, ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ఉపశమనం కల్పించింది. అఐ లో సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని పేర్కొంది. 26 అ లో ప్రస్తావించని ఎన్నో అంశాలు అఐ లో ఉన్నాయి. అఐ లో పూర్తి సమాచారం ఉంటుందని చెప్పవచ్చు. పూర్తి సమాచారం వల్ల మీ ఆదాయం ఎక్కువ కావొచ్చు. పన్ను భారం పెరుగుతుంది. ప్రస్తుతానికి ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఉత్తరోత్రా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కెవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన హబుల్ టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. గత నెలలో కంప్యూటర్లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్ టెలిస్కోప్ పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు నాసా ఇంజనీర్లు టెలిస్కోప్‌లో తలెత్తిన లోపాన్ని పరిష్కరించారు. గత నెలలో ఏర్పడిన కంప్యూటర్ లోపం కారణంగా అబ్జర్వేటరీతో అన్ని ఖగోళ పరిశోధనలు ఆగిపోయాయి. కాగా టెలిస్కోప్‌లో 1980 శకం కంప్యూటర్ల వలన లోపం తల్తెతడంతో టెలిస్కోప్ పరిశోధనలు ఆగిపోయాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. నాసా ఇంజనీర్లు గురువారం హబుల్ టెలిస్కోప్‌లో బ్యాకప్ పరికరాలకు విజయవంతంగా మార్చారు. దీంతో హబుల్ టెలిస్కోప్ పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నట్లు శుక్రవారం నాసా ఒక ప్రకటనలో తెలిపింది. టెలిస్కోప్‌లో తలెత్తిన లోపానికి పరిష్కారం చూపిన ఇంజనీర్లకు నాసా సైన్స్ మిషన్ చీఫ్ థామస్ జుర్బుచెన్ అభినందనలు తెలిపారు. 1990 లో ప్రారంభించిన హబుల్ విశ్వం గురించి ఇప్పటికీ వరకు 1.5 మిలియన్లకు పరిశోధనలను చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. -
‘మిషన్’ ట్రబుల్
తొలి విడత మిషన్ ప్రగతి మొత్తం చెరువుల లక్ష్యం 903 మంజూరైనవి 851 టెండర్లు.. అగ్రిమెంట్ అయినవి 847 పనులు ప్రారంభమైనవి 838 25 శాతం మేరకు పనులు జరిగినవి 13 25 నుంచి 50 శాతం పనులైనవి 13 50 నుంచి 75 శాతం అయినవి 41 75 నుంచి 100 శాతం మధ్య ఉన్నవి 155 మొత్తం పనులైనవి 616 ఖమ్మం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత మిషన్ కాకతీయ పనులకు అక్కడక్కడ అవాంతరాలు ఏర్పడ్డాయి. జిల్లాలో మొదటి విడత 851 చెరువులకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇప్పటివరకు 616 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు అధికారుల లెక్కల్లో ఉంది. ఐదు డివిజన్ల పరిధిలో మొత్తం 4,517 చెరువులు ఉన్నాయి. వీటిని నాలుగేళ్లలో పునరుద్ధరించడానికి ప్రణాళికలు తయారు చేసి.. తొలి ఏడాది 903 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. వాటిలో 851 చెరువులకు ప్రభుత్వ పరిపాలన అనుమతి ఇచ్చింది. సంబంధిత అధికారులు 847 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. 838 చెరువు పనులు చేశారు. 616 చెరువుల్లో వంద శాతం పనులు అయినట్లు, 155 చెరువుల్లో 75 నుంచి 100 శాతం పనులు, 25 నుంచి 50 శాతం 13 చెరువులు, 25 శాతం అయినవి 13 ఉన్నట్లు అధికారులు తయారు చేసిన నివేదికలే చెబుతున్నాయి. పూర్తికాక ముందే అక్రమాలు..! తొలి విడత పనులు ఆలస్యంగా మొదలుపెట్టడం.. ఇంతలోనే వర్షాలు కురవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. అత్యధిక చెరువుల్లో పూడికతీత పూర్తి కాకముందే వర్షాలు కురిసి గుంతల్లో నీరు చేరాయి.. ఈ క్రమంలోనే పనుల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పునరుద్ధరణలో భాగంగా చెరువు కట్టలకు పోసిన మట్టి నాణ్యతగా లేకపోవడం.. అంచనా ప్రకారం మట్టి పోయకపోవడం.. చెరువు శిఖంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించలేదని అప్పుడే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆటుపోట్ల మధ్య తొలి ఏడాది మిషన్ కాకతీయ పనులు 73 శాతం మేర పూర్తి చేశారు. ఖమ్మం డివిజన్, కొత్తగూడెం, సత్యనారాయణపురం, సత్తుపల్లి డివిజన్ పరిధిలో గత ఏడాది చేపట్టిన 838 చెరువుల్లో పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. తొలి ఏడాది మొత్తం 4,517 చెరువుల్లో 20 శాతం అంటే.. 903 చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటిలో 889 చెరువులను సర్వే చేశారు. 875 చెరువుల ఎస్టిమేట్లు రూ.282.46 కోట్లతో పంపించారు. ప్రభుత్వం నుంచి 851 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. వాటిలో 849 చెరువులకు టెండర్లు పిలవగా.. 847 చెరువుల టెండర్లు పూర్తి చేశారు. వాటిలో 946 చెరువులకు అగ్రిమెంట్ చేసినప్పటికీ.. 838 చెరువుల్లో రూ.145 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రూ.70కోట్ల బిల్లులను ఆయా కాంట్రాక్టర్లకు చెల్లించారు. మిగిలిన పనులన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పదేపదే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. ఇంకా 150 పైగా చెరువుల్లో ఎక్కువ మొత్తంలో పనులు చేపట్టాల్సి ఉంది. పాత వాటితోపాటు రెండో విడతలో మరో 903 చెరువులు వచ్చి చేరుతాయి. పాతవి, కొత్తవి కలిపి పెద్ద మొత్తంలోనే ఈ ఏడాది పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పనులు చేస్తేగానీ.. రెండో ఏడాది ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది తెలుస్తుంది. పనులన్నీ పూర్తి చేస్తాం.. మిషన్ కాకతీయ పథకంలో మొదటి ఏడాది మిగిలిన పనులతో పాటు రెండో ఫేజ్‌లో చేపట్టాల్సినవన్నీ ఈ ఏడాది పూర్తి చేస్తాం. తొలి ఏడాది అంచనాలు, పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభించడం.. రెండుసార్లు అకాల వర్షాల ప్రభావంతో నెల రోజులుపాటు పనులు నిలిచిపోయాయి. అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాం. అయినా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపాం. మొదటి ఫేజ్‌లోని మిగిలిన 100 నుంచి 150 చెరువుల పూర్తిస్థాయి పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయిస్తాం. ఫేజ్-2లో చెరువుల అభివృద్ధి కూడా వేగవంతంగా నడుస్తోంది. రెండో ఏడాదికి 961 చెరువులకు రూ.488 కోట్ల అంచనాలు తయారు చేసి.. 927 చెరువులకు అనుమతి కోసం ఇరిగేషన్ సీఈ కార్యాలయానికి పంపించాం. 810 చెరువులకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. 623 చెరువులకు టెక్నికల్ అనుమతి రావడంతో ఇప్పటికే 610 చెరువులకు టెండర్లు పూర్తి చేశాం. 403 చెరువులకు రూ.68కోట్లతో అగ్రిమెంట్ పూర్తి చేశాం. ఇప్పటికే 85 చెరువుల పనులు మొదలుపెట్టాం. - వేమిశెట్టి రమేష్, ఇరిగేషన్ ఎస్ఈ -
ఆదిలోనే సుస్తీ
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు ముందుకు రాని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నిధులు నిలిపివేసిన సర్కార్ విశాఖపట్నం: జిల్లాలో ఎన్టీఆర్ ఆరోగ్యసేవ (రాజీవ్ ఆరోగ్యశ్రీ)లో ఎంప్లాయీస్‌హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలుకు ఆరంభంలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీని అమలుకు కొన్ని ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి. పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇలాం టి ఆస్పత్రులకు ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పరిధిలో రాష్ర్ట వ్యాప్తంగా 490 నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వీటిలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రూ.2.50 లక్షల విలువైన వైద్యసేవలు అందేవి. ఉద్యోగులకు కూడా ఈనెల 6వ తేదీ నుంచి ఈ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వ్యయపరిమితి లేకుండా వైద్యసేవలు ఉచి తంగా పొందేందుకు వీలు కల్పించారు. ఇందుకోసం జిల్లాకో ప్రభుత్వాస్పత్రి చొప్పున ఎంపిక చేశారు. కేజీహెచ్‌తో సహా ఎంపికైన ప్రతీ ప్రభుత్వాస్పత్రిలో ఏసీ రూములు, ఇతర అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా మరో 24 నెట్వర్క్ ఆస్పత్రులు ఎంవోయూ చేసుకోలేదు. ఇందులో 13 ఆస్పత్రులు విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఒప్పందం చేసుకోని ఈ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధుల విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి ఒప్పించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. డీఎంహెచ్‌వో, కలెక్టర్లు ఈ వారంలో ఈ నెట్వర్క్ఆస్పత్రులో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందం చేసుకొని ఆస్పత్రులతో ఎంవోయూ చేయించే విధంగా ఒప్పించనున్నారు. ఒక వేళ ముందుకు రాకుంటే వాటిని ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. ఈహెచ్ఎస్ అమలు విషయంలో కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అమలు చేస్తున్న మార్గదర్శకాలనే ఈహెచ్ఎస్కు కూడా అమలు చేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు ఆది నుంచి డిమాండ్ చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో విశాఖ జిల్లాలో రూ.3.18కోట్ల విలువైన 1,23,994 శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఇప్పటి వరకు రూ.2.5కోట్లు మాత్రమే విడుదల చేశారు. జిల్లాలో 29 నెట్వర్క్ ఆస్పత్రులుండగా, వీటిలో కేజీహెచ్‌తో సహా ఎనిమిది ప్రభుత్వాస్పత్రులున్నాయి. మిగిలిన 21 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 8 ఆస్పత్రులు ఈహెచ్ఎస్అమలుకు ముందుకు రాగా మిగిలినవి ససేమిరా అంటున్నాయి. ఈ నెల 6 నుంచి ఈహెచ్ఎస్ అమలులోకి వచ్చినప్పటికీ ఎంవోయూకు ముందుకురాని ఈ ఆస్పత్రులకు అదే రోజు నుంచి ఆరోగ్యశ్రీ నిధుల విడుదలను నిలిపివేశారు. ఈ ఆస్పత్రులకు సరైన మార్గదర్శకాలు పాటించకపోవడంతో పాటు ఇతర కారణాలున్నప్పటికీ ఎంవోయూ చేసుకోకపోవడమే ప్రధాన అడ్డంకి అని చెబుతున్నారు. -
నిలిచిన కేదార్నాథ్ యాత్ర
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్నాథ్ లోయ అంతటా ఆదివారం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులు సోన్ప్రయాగ వద్దే ఆగి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది. 1. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు. 2. గతేడాది యాత్రా సమయంలో వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. 3. {పముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్లోనే ఉండిపోయారు