మేము ఐటీఆర్ ఫారం ఆన్‌లైన్‌లో వేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలి? – హసిత, వినీత, హైదరాబాద్
చాలా మంది సైటుకి వెళ్లి ఆన్‌లైన్‌లో రిటర్నులు వేద్దామని మొదలెడితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు, ఫారం1ను పోర్టల్‌లో నింపినప్పుడు అన్ని వివరాలు పొందుపర్చాకా ఆ సమాచారం మాయం అవుతోంది. దీనివల్ల మళ్లీ పని చేయాలి. లాగ్‌అవుట్ అయ్యి, మళ్లీ లాగిన్ కావాలి. అక్కణ్నుంచి మళ్లీ కథ మొదలు. ఒక్కొక్కప్పుడు తొలిసారే సమాచారం సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాతే రిటర్నులను దాఖలు చేయగలరు. అలాగే ఐటీఆర్ 2ని నింపినప్పుడు ’క్యాపిటల్ గెయిన్ సమాచారం’. ఆన్‌లైన్‌లో నింపే విధానంలో ప్రతి పేజి మీదా షెడ్యూల్ లేదా పట్టిక మీదా క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించిన సమాచారం ’వేలిడేట్’ (అంటే సమాచారాన్ని చెక్ చేసుకుని, అవునని నిర్ధారించడం) అవడం లేదు. అంటే కన్ఫర్మ్ కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి వాటి వల్ల చేసిందే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుండటం, జాప్యం వల్ల సమయం వృ«థా కావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ తప్పదు. వీటితో పాటు ముందుకు సాగాల్సిందే.
కొందరు ఐటీ రిటర్నులను ఆన్‌లైన్‌లో వేయలేకపోతున్నారు. ఆఫ్‌లైన్‌లో నింపి ఆన్‌లైన్‌లో వేయవచ్చా? – రిద్ధి, రిత్విక్, విశాఖపట్నం
ఇక్కడ కొంత అవగాహన ఏర్పడాలి. ఆదాయాన్ని బట్టి, స్టేటస్‌ను బట్టి రకరకాల ఫారాలు ఉన్నాయి. అన్ని ఫారాలు ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి, ఒక్కొక్క సమాచారాన్ని నింపుకుంటూ, వేలిడేట్ చేసుకుంటూ ఫైల్ చేస్తారు. సవ్యంగా, ఏ ఆటంకాలు లేకుండా ఉంటే ఇది సులువుగాను, వేగంగానూ పూర్తవుతుంది. కొన్ని విభాగాల వారికి .. అంటే ట్రస్టులు, సొసైటీలు, కంపెనీలు మొదలైన వాటికి డైరెక్టుగా నింపడం ఇంకా రాలేదు. వీటిని కంప్యూటర్ సహాయంతో ఆఫ్‌లైన్‌లో, వాడుకలో ఉన్న ’యుటిలిటీ’ ద్వారా నింపాలి. 5,6,7 ఫారాలు ఎక్సెల్ యుటిలిటీ ద్వారా నింపిన తర్వాత ’JSON’ ఫైల్ (జావా ఫైల్) ద్వారా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ’అప్‌లోడ్’ చేయాలి. ఇది కూడా త్వరగానే అవుతుంది. 1,2,3,4 ఫారాలు ఆన్‌లైన్‌లోనే డైరెక్టుగా వేయవచ్చు.
ఫారం 26 అ తో పాటు అఐ కూడా డౌన్‌లోడ్ చేసుకుని రిటర్న్ వేయాలా? – భాను, సుమంత్, వరంగల్
రిటర్నులు వేసే స్టేట్‌మెంట్ ఆఫ్ ఇన్‌కం తయారు చేసుకోండి. ఫారం 26 అ లో అంశాలు తీసుకోండి. కొన్ని రోజుల క్రితం అఐ వచ్చింది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS )లో ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే, ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ఉపశమనం కల్పించింది. అఐ లో సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని పేర్కొంది. 26 అ లో ప్రస్తావించని ఎన్నో అంశాలు అఐ లో ఉన్నాయి. అఐ లో పూర్తి సమాచారం ఉంటుందని చెప్పవచ్చు. పూర్తి సమాచారం వల్ల మీ ఆదాయం ఎక్కువ కావొచ్చు. పన్ను భారం పెరుగుతుంది. ప్రస్తుతానికి ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఉత్తరోత్రా మంచిది.
- కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కెవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment