‘మిషన్’ ట్రబుల్ | trouble for mission kakathiya | Sakshi
Sakshi News home page

‘మిషన్’ ట్రబుల్

Published Sat, Mar 12 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

‘మిషన్’ ట్రబుల్

‘మిషన్’ ట్రబుల్

తొలి విడత మిషన్ ప్రగతి
మొత్తం చెరువుల లక్ష్యం 903
మంజూరైనవి  851
టెండర్లు.. అగ్రిమెంట్ అయినవి 847
పనులు ప్రారంభమైనవి 838
25 శాతం మేరకు పనులు జరిగినవి 13
25 నుంచి 50 శాతం పనులైనవి 13
50 నుంచి 75 శాతం అయినవి   41
75 నుంచి 100 శాతం మధ్య ఉన్నవి 155
మొత్తం పనులైనవి 616

ఖమ్మం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత మిషన్ కాకతీయ పనులకు అక్కడక్కడ అవాంతరాలు ఏర్పడ్డాయి. జిల్లాలో మొదటి విడత 851 చెరువులకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇప్పటివరకు 616 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు అధికారుల లెక్కల్లో ఉంది. ఐదు డివిజన్ల పరిధిలో మొత్తం 4,517 చెరువులు ఉన్నాయి. వీటిని నాలుగేళ్లలో పునరుద్ధరించడానికి ప్రణాళికలు తయారు చేసి.. తొలి ఏడాది 903 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. వాటిలో 851 చెరువులకు ప్రభుత్వ పరిపాలన అనుమతి ఇచ్చింది. సంబంధిత అధికారులు 847 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. 838 చెరువు పనులు చేశారు. 616 చెరువుల్లో వంద శాతం పనులు అయినట్లు, 155 చెరువుల్లో 75 నుంచి 100 శాతం పనులు, 25 నుంచి 50 శాతం 13 చెరువులు, 25 శాతం అయినవి 13 ఉన్నట్లు అధికారులు తయారు చేసిన నివేదికలే చెబుతున్నాయి.

పూర్తికాక ముందే అక్రమాలు..!
తొలి విడత పనులు ఆలస్యంగా మొదలుపెట్టడం.. ఇంతలోనే వర్షాలు కురవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. అత్యధిక చెరువుల్లో పూడికతీత పూర్తి కాకముందే వర్షాలు కురిసి గుంతల్లో నీరు చేరాయి.. ఈ క్రమంలోనే పనుల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పునరుద్ధరణలో భాగంగా చెరువు కట్టలకు పోసిన మట్టి నాణ్యతగా లేకపోవడం.. అంచనా ప్రకారం మట్టి పోయకపోవడం.. చెరువు శిఖంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించలేదని అప్పుడే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆటుపోట్ల మధ్య తొలి ఏడాది మిషన్ కాకతీయ పనులు 73 శాతం మేర పూర్తి చేశారు. ఖమ్మం డివిజన్, కొత్తగూడెం, సత్యనారాయణపురం, సత్తుపల్లి డివిజన్ పరిధిలో గత ఏడాది చేపట్టిన 838 చెరువుల్లో పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

తొలి ఏడాది మొత్తం 4,517 చెరువుల్లో 20 శాతం అంటే.. 903 చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటిలో 889 చెరువులను సర్వే చేశారు. 875 చెరువుల ఎస్టిమేట్‌లు రూ.282.46 కోట్లతో పంపించారు. ప్రభుత్వం నుంచి 851 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. వాటిలో 849 చెరువులకు టెండర్లు పిలవగా.. 847 చెరువుల టెండర్లు పూర్తి చేశారు. వాటిలో 946 చెరువులకు అగ్రిమెంట్ చేసినప్పటికీ.. 838 చెరువుల్లో రూ.145 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రూ.70కోట్ల బిల్లులను ఆయా కాంట్రాక్టర్లకు చెల్లించారు. మిగిలిన పనులన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పదేపదే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. ఇంకా 150 పైగా చెరువుల్లో ఎక్కువ మొత్తంలో పనులు చేపట్టాల్సి ఉంది. పాత వాటితోపాటు రెండో విడతలో మరో 903 చెరువులు వచ్చి చేరుతాయి. పాతవి, కొత్తవి కలిపి పెద్ద మొత్తంలోనే ఈ ఏడాది పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పనులు చేస్తేగానీ.. రెండో ఏడాది ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది తెలుస్తుంది.

 పనులన్నీ పూర్తి చేస్తాం..
మిషన్ కాకతీయ పథకంలో మొదటి ఏడాది మిగిలిన పనులతో పాటు రెండో ఫేజ్‌లో చేపట్టాల్సినవన్నీ ఈ ఏడాది పూర్తి చేస్తాం. తొలి ఏడాది అంచనాలు, పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభించడం.. రెండుసార్లు అకాల వర్షాల ప్రభావంతో నెల రోజులుపాటు పనులు నిలిచిపోయాయి. అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాం. అయినా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపాం. మొదటి ఫేజ్‌లోని మిగిలిన 100 నుంచి 150 చెరువుల పూర్తిస్థాయి పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయిస్తాం. ఫేజ్-2లో చెరువుల అభివృద్ధి కూడా వేగవంతంగా నడుస్తోంది. రెండో ఏడాదికి 961 చెరువులకు రూ.488 కోట్ల అంచనాలు తయారు చేసి.. 927 చెరువులకు అనుమతి కోసం ఇరిగేషన్ సీఈ కార్యాలయానికి పంపించాం. 810 చెరువులకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. 623 చెరువులకు టెక్నికల్ అనుమతి రావడంతో ఇప్పటికే 610 చెరువులకు టెండర్లు పూర్తి చేశాం. 403 చెరువులకు రూ.68కోట్లతో అగ్రిమెంట్ పూర్తి చేశాం. ఇప్పటికే 85 చెరువుల పనులు మొదలుపెట్టాం. - వేమిశెట్టి రమేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement