immediately
-
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్‌నగర్‌లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్‌లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్‌నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్‌లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి?
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, చిత్తవైకల్యం మొదలైన సమస్యలను సృష్టిస్తుంది. మానసిక స్థితిని త్రీవంగా ప్రభావితం చేస్తుంది. మతిమరపును కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఎవరైనా సరే మంచి ప్రశాంతతను పొందుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం అణు రియాక్టర్ మెల్ట్డౌన్లు, పెద్ద ఓడలు మునిగిపోవడం, విమాన ప్రమాదాలు వంటి విషాదకర సంఘటనల వెనుక నిద్రలేమి కారణంగా నిలుస్తుంది. సైన్యంలో పని చేసేవారికి నిద్రా సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు నిద్ర వచ్చేందుకు, మంచి విశ్రాంతి తీసుకునేందుకు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. దానిని మిలటరీ మెథడ్ అని అంటారు. ఈ విధానం ద్వారా ఎవరైనా సులభంగా త్వరగా నిద్రపోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారిగా 1981లో ‘రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్షిప్ పెర్ఫార్మెన్స్’ అనే పుస్తకంలో ఈ టెక్నిక్కు సంబంధించిన పలు వివరాల అందించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరకారంలో మిలిటరీ పద్ధతిని ఉపయోగించిన ప్రీ-ఫ్లైట్ స్కూల్లోని పైలట్లు 10 నిమిషాల్లోనే నిద్రపోయారని ఆ పుస్తకంలో తెలియజేశారు. ఈ పద్ధతిని ఉపయోగించిన 96% పైలట్లు యుద్ధ సమయంలోనూ కొద్దిసేపటికే మంచి విశ్రాంతి తీసుకోగలిగారని వెల్లడయ్యింది. ఐదు దశల్లో త్వరగా నిద్ర ఈ మ్యాజిక్ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానం ద్వారా ఎవరైనా సరే త్వరగా నిద్రపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1 మీ ముఖాన్ని రిలాక్స్ చేయండి: మీ ముఖంలోని నుదురు, కళ్ళు, బుగ్గలు, దవడ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. వాటిపై ఒత్తిడి ఉన్నట్లు భావించి, తరువాత దానిని వదిలివేసి, రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. 2 మీ భుజాలను వదులు చేయండి: మీ చేతులను రిలాక్స్ చేయండి. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్న భావన చేయండి. చేతులు, భుజాల మీదుగా గాలి తగులుతూ అది మెల్లగా మీ చేతుల కిందకి వస్తున్నట్లు ఊహించండి. 3 గట్టిగా ఊపిరి తీసుకోండి. నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. మీరు అలా చేస్తున్నప్పుడు, అది మీ కడుపుని ఎలా తేలికపరుస్తున్నదనే దానిపై దృష్టి పెట్టండి. మీ కడుపును బిగపట్టడానికి ప్రయత్నించవద్దు. అన్ని అవయవాలు తేలికపడినట్లు భావించండి. 4 మీ కాళ్ళను విశ్రాంతి తీసుకోనివ్వండి. నునువెచ్చని గాలి మీ కాళ్ళను సున్నితంగా తాకుతున్నట్లు భావించండి. మీ కాళ్ళు మంచంపై రిలాక్స్ అవుతున్నట్లు చేయండి. 5 మీ మనసును ప్రశాంతపరచండి. ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మేఘాలను తదేకంగా చూడడం లేదా ప్రశాంతమైన చిత్రాలను చూసేందుకు ప్రయత్నించండి. 10 సెకన్ల పాటు మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు త్వరగా నిద్రపడుతుంది. అభ్యాసంతో సాధ్యం ఈ మిలటరీ మెథడ్ గురించి సైన్స్ ఏమి చెబుతున్నదంటే.. ఈ విధానంలోని1, 2, 5 దశలు కండరాలకు సడలింపునిస్తాయి. ప్రశాంతతకు, శాంతియుత స్థితిని ప్రేరేపించడానికి మంచి మార్గాలుగా నిలుస్తాయి. మూడవ దశలో శ్వాస పద్ధతులు మెరుగుపడతాయి. ఐదవ దశ శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది. ఈ ప్రక్రియ అత్యంత త్వరగా నిద్రను అందిస్తుంది. ఈ మిలటరీ మెథడ్‌లో అనేక ప్రయోజనాలుఉన్నాయి. నిద్ర అలవాట్లను మెరుగుపరచడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి అని పలు పరిశోధనలలో తేలింది. అయితే మిలటరీ మెథడ్‌లో తక్షణ ఫలితాలను ఆశించకూడదని, ఇది అలవడేందుకు రెండు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని నిపుణులుచెబుతున్నారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు -
కేరళ వైద్యురాలిపై దాడి: కేంద్ర ఆరోగ్యమంత్రికి వైద్యుల సంఘం లేఖ
కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే వైద్యుల సంఘం ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్ఓఆర్డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసీయేషన్(ఆర్డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్తో మార్చ్ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడమే గాక సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్ అనే సస్పెన్షన్‌కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..) -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ప్రభుత్వపాఠశాలల మనుగడకు చర్యలు చేపట్టాలి టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌అలీ విద్యారణ్యపురి : ఉద్యోగ,ఉపాధ్యాయులకు పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ ప్రై మరీ టీచర్స్అసోసియేషన్(టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్‌అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్పీటీఏ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీహైస్కూల్లో నిర్వహించిన ఆ ఉపాధ్యాయసం ఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. కాలయాపన కాకుండా కరువుభత్యం మంజూరి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు పాఠశాలలను నియంత్రించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను ప్రవేశపెట్టాలన్నా రు. అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రపతి చేత ఆమోదింపజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలల్లోను ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా చిన్నచిన్న జిల్లాల ఏర్పాటు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయన్నారు. టీఎస్పీటీఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్.ఆశాకుమారి మాట్లాడుతూ విద్యాశాఖమంత్రి ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నా రు. రాష్ట్ర అసోసియేట్ రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి ఖాజా అజీముద్దీన్,అదనపు ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలీమ్, జిల్లా అధ్యక్షుడు ఎంఏ బాసిత్,జిల్లా జనరల్సెక్రటరీ పివి.రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భారీగా తగ్గనున్న క్యాన్సర్ , బీపీ మందుల ధరలు
న్యూఢిల్లీ: భారతదేశంలో సాధారణమైన ముదిరిన వ్యాధుల చికిత్సకు వాడే మందుల ధరలను దాదాపు సగానికిపైగా తగ్గిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్, బీపీ, లాంటి వ్యాధిగ్రస్తులకు సరసమైన ధరులకు మందులను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ చర్యలకు దిగింది. 54 రకాల మందుల ధరలను 55 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రక్తపోటు, మెదడు, రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం , యాంటీబయాటిక్స్, గుండె వ్యాధులకు సంబంధించిన మందులు సహా 54 మందుల ధర తగ్గించాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తెలిపింది. తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. కాగా ఎన్పీపీఏ 15 రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండవ సారి. ఏప్రిల్ 28 కొన్ని రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. -
కమిటీలొద్దు..సమైక్యమే ముద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కమిటీలతో తమకు అవసరం లేదని, తక్షణమే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో చైర్మన్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ కోరారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధన కోసం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మూడో రోజు ఆదివారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయని తెలిపారు. ఉద్యమం తీవ్రత ఢిల్లీ దృష్టికి పోతోందని.. దీంతో ఆంటోని కమిటీ వచ్చిందన్నారు. తాజాగా ప్రభుత్వ కమిటీని కేంద్రం ప్రకటించిందని వివరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, భావి తరాల అభ్యున్నతికి కోసం ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మెను అన్ని వర్గాలు అభినందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, సర్దార్ అబ్దుల్‌హమీద్, ఇతర ప్రతినిధులు వెంకటేశ్వర్లు, జానకిరామ్, ఎస్ఏఎం.దాస్, లక్ష్మన్న, కరీమ్, జాకీర్ బాష, గోవిందు, రాజారావు, బాలస్వామి, బాషుమియ్య, విభీషణరావు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఎంవి.క్రిష్ణారెడ్డి, ఎంఎస్ఆర్ వరప్రసాద్, మురళీమోహన్‌రెడ్డి, కమలాకర్, రవికుమార్, రాఘవరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఖాజా మోద్దీన్, మజహర్ ఉసేన్, చాంద్‌బాష, కె.శేఖర్, రాంగోపాల్ రెడ్డి, రమేష్ నాయక్, ఎం.శివరామ్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు. వీరికి పలు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.