పీఆర్‌సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
-
ప్రభుత్వపాఠశాలల మనుగడకు చర్యలు చేపట్టాలి
-
టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌అలీ
విద్యారణ్యపురి : ఉద్యోగ,ఉపాధ్యాయులకు పీఆర్‌సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ ప్రై మరీ టీచర్స్‌అసోసియేషన్(టీఎస్‌పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్‌అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్‌పీటీఏ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీహైస్కూల్‌లో నిర్వహించిన ఆ ఉపాధ్యాయసం ఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. కాలయాపన కాకుండా కరువుభత్యం మంజూరి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు పాఠశాలలను నియంత్రించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాల ల్లో పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను ప్రవేశపెట్టాలన్నా రు. అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రపతి చేత ఆమోదింపజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలల్లోను ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా చిన్నచిన్న జిల్లాల ఏర్పాటు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయన్నారు. టీఎస్‌పీటీఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్.ఆశాకుమారి మాట్లాడుతూ విద్యాశాఖమంత్రి ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నా రు. రాష్ట్ర అసోసియేట్ రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి ఖాజా అజీముద్దీన్,అదనపు ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలీమ్, జిల్లా అధ్యక్షుడు ఎంఏ బాసిత్,జిల్లా జనరల్‌సెక్రటరీ పివి.రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.