పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పీఆర్‌టీయూ-టీఎస్ విజ్ఞప్తి చేసింది.
మంత్రి ఈటలకు పీఆర్‌టీయూ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పీఆర్‌టీయూ-టీఎస్ విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్షుడు దేశ్‌పాండే మంత్రిని కలిశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీన వేతనాలివ్వాలని కోరారు.