హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్ ఇవాళ్టి నుంచి బంద్ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment