కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే వైద్యుల సంఘం ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌ఓఆర్‌డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది.
లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్‌ఓఆర్‌డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసీయేషన్(ఆర్‌డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్‌తో మార్చ్ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడమే గాక సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు.
కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్ అనే సస్పెన్షన్‌కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది.
(చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..)
Comments
Please login to add a commentAdd a comment