తిరువనంతపురం: కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనతో డాక్టర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ఆడిట్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. స్పేస్‌ఆడిట్‌తో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో డాక్టర్ల భద్రతపై మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాత్రివేళ డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్‌ను కాపాడేందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించింది. రోగి సహా ఎవరైనా హింసాత్మకంగా లేదా బెదిరింపు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు కోడ్ గ్రే అమలు చేయాలని ప్రభుత్వం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment