Safety acts
-
డాక్టర్ల భద్రతపై కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనతో డాక్టర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆడిట్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. స్పేస్ఆడిట్తో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో డాక్టర్ల భద్రతపై మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. రాత్రివేళ డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్‌ను కాపాడేందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించింది. రోగి సహా ఎవరైనా హింసాత్మకంగా లేదా బెదిరింపు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు కోడ్ గ్రే అమలు చేయాలని ప్రభుత్వం కోరింది. -
మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి..
పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్యానకి చెవి, ముక్కు, కంటి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. చెవి విషయానికొస్తే, చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ వినికిడి లోపం పెరుగుతంది. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి చెవిని కాపాడడంలో.. చేయాల్సిన జాగ్రత్తలను చూద్దాం. చెవులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.. పల్లెటూళ్లలో వేసవి సెలవులు రాగానే ఈత నేర్చుకోవడం కోసం పిల్లలు నీటి కుంటలు, చెరువులకు వెళ్తుంటారు. చెరువుల్లోని మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు పరిశుభ్రమైన నీళ్లలోనే దిగాలి. చెవులను శుభ్రం చేయడానికి కొందరు గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం చెవుల్లో పోస్తారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌క్రీముల వంటివాటితో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవే ఇన్ఫెక్షన్లు చెవులకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చెవి, గొంతు, ముక్కు.. భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను మరింతగా పాటించాలి. పై జాగ్రత్తలు పాటించాక కూడా.. గులివి, చీము వంటి సమమస్యలతో పాటు.. చెవిపోటు ఎక్కువగా వస్తున్నా, సరిగా వినిపించకపోయినా.. వీలైనంత త్వరగా ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. ఇవి చదవండి: హాయి హాయిగా... కూల్ కూల్‌గా! -
అమిత్‌షా చేవెళ్ల సభపై రాజకీయ వేడి
-
AP:రాష్ట్రంలో రహదారులకు మహర్దశ
-
సీఎం జగన్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ భేటీ.. కీలకాంశాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో సోమవారం రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలు కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేసిన సీఎం జగన్.. కీలక నిర్ణయాలు కొన్నింటి అమలుకు ఆమోదం సైతం తెలిపారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటం, నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు చేర్చడంలో ‘108’ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేశారు. గోల్డెన్ అవర్‌లోగా వారిని ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయన్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 1190 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, అందులో 520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ నిర్వహిస్తున్న నేషనల్ హైవేల్లోనూ 78 బ్లాక్ స్పాట్స్‌ను రెక్టిఫై చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సూచనలు ►ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. అలాగే ఈ సదుపాయాలను ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు, డ్రైవింగ్ శిక్షణ కోసం కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ►ట్రామా కేర్ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ►అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలన్న సీఎం. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా వైజాగ్‌లో రీహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఇక తిరుపతి బర్డ్ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్ సదుపాయాల్ని మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ►రోడ్డు ప్రమాదాలకు అధికారులు పలు కారణాలు వివరించగా.. సీఎం జగన్ పలు సూచనలు సైతం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుపై లేన్‌మార్కింగ్ చాలా స్పష్టంగా ఉండేలా చూడాలని, బైక్‌లకు ప్రత్యేక లేన్, ఫోర్‌వీల్ వాహనాలకు ప్రత్యేక లేన్స్ ఏర్పాటుపై ఆలోచన చేయాలని తెలిపారు. అలాగే ఎంత స్పీడులో పోవాలనే దానిపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లు పక్కన ధాబాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూస్తూ.. ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని అధికారులకు సీఎం సూచించారు. ప్రధాన రహదారులు, ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం జగన్ కోరారు. ►అలాగే డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలన్న సీఎం వైఎస్ జగన్.. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేయాలని, ఆశించిన ఫలితాలు రావాలంటే జిల్లా కమిటీలు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికార గణం సమీక్ష చేయాల్సిందేనని కోరారు సీఎం. పలు నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్ ► రోడ్ సేఫ్టీ మీద లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు పచ్చ జెండా. పోలీసు, ట్రాన్స్పోర్ట్, హెల్త్ & రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిపుణులు ఇందులో ఉంటారు. ► రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ► ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్ ట్రీట్ మెంట్ అందేలా నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం ►రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారిపట్ల మంచి ప్రోత్సాహం అందించాలన్న సీఎం జగన్. ►ఐరాడ్ యాప్ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్ అప్డేట్ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి ► పీపీపీ పద్ధతిలో రవాణాశాఖద్వారా ఆటోమేటెడ్ ఎఫ్‌సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ. ► రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి సునీత, రవాణాశాఖ కమిషనర్ పి సీతారామాంజనేయలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్‌గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్‌తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు
‘ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకరు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆది, సోమవారాల్లో అహ్మదాబాద్ పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు ముందు వెజల్పూర్ పోలీసులు ఎస్సై ఒడెదర పేరుతో ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆదివారం ఉదయం ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి మంత్రి షా వస్తున్నారని, కాబట్టి, ఆ దగ్గర్లోని 300 ఇళ్ల కిటికీలన్నింటిని మూసేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. జె కేటగిరీ సెక్యూరిటీ నేపథ్యంలోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జులై 10న ఆ నోటీసులను ఐదు అపార్ట్మెంట్లకు, చుట్టుపక్కల ఇళ్లకు అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్ చేశారు కూడా. అయితే వెజల్పూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పంక్తి జోగ్(44) అనే ఆవిడ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కాబట్టి కిటికీలు తెరిచే ఉంచుతానని ఆమె స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులకు స్పష్టం చేసింది. అంతేకాదు తనలాంటి వాళ్లు ఎందరో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె పోలీసులతో వాదించింది. నిజానికి ఆమె అభ్యంతరం అదొక్కటే ఒక్కటే కాదు. పంక్తి ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. షా పర్యటన నేపథ్యంలో పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించారనేది ఆమె పాయింట్. మూడు రోజుల పాటు చిరువ్యాపారులను వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారని, అలాగే మళ్లింపు పేరుతో వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకు స్థానికులు కొందరు సైతం తోడవ్వడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎస్సైపై చర్యలు? ‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే ఉన్నామా? వీళ్లు మంత్రులా? రాజులా?. ఆయనేమైనా రాజా? దేవుడా? ఇంత అతి చేస్తున్నారు. కాదు కదా. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటి?. స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం సామాన్యులకు హక్కులు ఇచ్చింది’ అని ఆమె పోలీసుల ఎదుట వాదించింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రజల్ని బలవంతం చేయలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని చెబుతూనే సర్క్యులర్ గురించి మాట్లాడేందుకు ఎస్సై ఒడెదర నిరాకరించారు. ఇక ఈ వ్యవహారం మీడియా ద్వారా ఫోకస్‌లోకి రావడంతో అహ్మదాబాద్ కమిషన్ సంజయ్ వాస్తవ స్పందించారు. ఇలాంటి ఆదేశాలను చర్యలను ఉపేక్షించమని, దర్యాప్తు జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ పోలీసులకు తమ నుంచి అలాంటి ఆదేశాలు ఏం జారీ కాలేదని కేంద హోం మంత్రి అమిత్ షా భద్రతా విభాగం వెల్లడించింది. -
శకటమా.. వీరంతా క్షేమమా..?!
బాపట్లటౌన్: రవాణాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వాహన చోదకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తత్ఫలితంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. మైనర్లు, లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపుతున్నా నియంత్రించడంలో రవాణా, పోలీస్ శాఖలు విఫలమయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి మరీ ప్రయాణికులను ఎక్కిస్తూ వాహనాలను నడుపుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. దీంతో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. పరిమితిని మించిన ప్రయాణాలు అరికడితే ప్రమాదాలను చాలావరకు నియంత్రించవచ్చు. అవగాహన సదస్సులు సరే...ఆచరణేది? ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందిన తర్వాతే వాహనాలు నడపాలని, పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అధికలోడుతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం అని చెప్పిన అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవింగ్ పూర్తిగా రాని వారికి కూడా అధికారులు లైసెన్స్‌లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హడావుడి చేయటం తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మైనార్టీ తీరని వారు కూడా వాయువేగంగా బైక్‌లపై దూసుకెళ్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కూడా రోడ్లపై కనిపిస్తూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు, పోలీస్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటోవాలాలు, ట్రాక్టర్ల వాళ్లు సామారŠాధ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలో వెనుక డోర్‌పై నిలబడి ప్రయాణిస్తున్నప్రజలు గజిబిజిగా నంబర్ ప్లేట్లు ద్విచక్ర వాహనాలపై నంబర్ ప్లేట్లు ఎవరికిష్టమొచ్చినట్లు వారు వేయించడం వలన ఆ బండి నంబర్ చూసేవారికి అర్ధం కావడం లేదు. మరికొంత మంది నంబర్‌పై ఉన్న మోజుతో కొన్ని నంబర్లు పెద్దవిగానూ, మరికొన్ని నంబర్లు చిన్నవిగా వేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చూసే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని వలన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాల వారు నంబర్‌ను సరిగా గుర్తించని కారణంగా బీమా రాని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకొందరు నంబర్‌ప్లేట్లపై సినీహీరోల బొమ్మలు వేసి, నంబర్‌ను చిన్నగా రాయిస్తున్నారు. ఈ విషయాలు రవాణా, పోలీస్ శాఖాధికారులకు తెలియంది కాదు. అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వలనే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గత 20 రోజుల వ్యవధిలో సుమారు 70 వాహనాలను సీజ్ చేశాం. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి వాహనచోదకులపై చర్యలు తీసుకుంటాం. – జి.రామచంద్రరావు, ఎంవీఐ కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుం టున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం. ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి ప్రమాదాలను నివారించేందుకు కృషిచేస్తాం. – జి.రవికృష్ణ, ఎస్ఐ -
ఆకాశయానంలో అనుకోని కష్టం
మన దేశంలో విమానయాన భద్రతకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల్లో లోపాలున్నాయని అమెరికాకు చెందిన ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) రెండు నెలలక్రితం చెప్పింది. వచ్చే 65 రోజుల్లోగా వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఈలోగానే వెంట్రుకవాసిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. గురువారం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ బోయింగ్ 737 శ్రేణి విమానంలో ఒక్కసారిగా పీడనం పడిపోవటంతో అందులోని 168 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. వారిలో 30 మందికి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు స్రవించింది. విమానంలో గాలి పీడనాన్ని నియంత్రించే మీట నొక్కటం మరిచిపోవటంవల్ల ఈ పరిణామం ఏర్పడింది. ఇలాంటి పొరపాట్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2005లో సైప్రస్ నుంచి గ్రీస్‌లోని ఏథెన్స్కు 115 మందితో వెళ్తున్న హెలియోస్ ఎయిర్వేస్ బోయింగ్ విమానంలో ఇలాంటి పొర బాటే జరిగి అది కుప్పకూలింది. పైలెట్లు మీట నొక్కడం మర్చిపోవటమే కాక పీడనం తగ్గుతున్నా గమనించలేకపోయారు. అంతే కాసేపటికి హైపోక్సియా (ఆక్సిజెన్ లోపించటం) ఏర్పడి వారు స్పృహ కోల్పోయారు. విమానాన్ని ఆటో పైలెట్ పద్ధతిలో ఉంచటంతో అది ఇంధనం అయిపోయేంతవరకూ గాల్లో ఎగిరి గ్రీస్ పర్వతాల్లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో సిబ్బంది సహా 121 మంది మరణించారు. విమానయాన భద్రత వ్యవహారాలను దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలోని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఆ సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ విధానాలు సంతృప్తికరంగా లేవని ఎఫ్ఏఏ తేల్చింది. ఎఫ్ఏఏకన్నా ముందు అంతర్జా తీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) సైతం ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. విమా నయాన భద్రత పర్యవేక్షణలో భారత్ స్థితి పాకిస్తాన్, నేపాల్ దేశాలతో పోల్చినా నాసిరకంగా ఉన్న దని వ్యాఖ్యానించింది. వైమానిక భద్రతలో మన స్కోరు 65.82 నుంచి 57.44కు పడిపోయిందని అది తేల్చింది. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు రోజూ వేలాది విమానాల రాకపోకలు సాగు తుంటాయి. ఇంతవరకూ ఈ మాదిరి ఘటన ఎప్పుడూ జరగలేదు. విమానం ఇంజిన్ ఆన్ చేసే ముందు క్యాబిన్లో ఒత్తిడి ఏమేరకు ఉందో పైలెట్లు చూసుకుంటారు. టేకాఫ్‌కు ముందు గాలి పీడ నాన్ని నియంత్రించే బటన్ నొక్కుతారు. దాంతో ఇంజిన్ నుంచి వేడి గాలి ఏసీ వ్యవస్థలోని హీట్ ఎక్స్చ్ంజర్లోకి ప్రవేశిస్తుంది. ఆ వ్యవస్థ దాన్ని చల్లగా మార్చి కేబిన్‌లోకి పంపుతుంది. పర్యవసా నంగా కేబిన్‌లో ఉష్ణోగ్రత, పీడనం నియంత్రణలో ఉంటాయి. ఇదంతా నిత్యం యధావిధిగా సాగి పోతుంది. కానీ జెట్ ఎయిర్వేస్ విమానం ప్రధాన పైలెట్ దీన్ని మరిచిపోయారు. విమానం గాల్లో 10,000 అడుగులు లేచాక పది నిమిషాల్లోనే ఆ ప్రభావం ప్రయాణికుల అనుభవంలోకొచ్చింది. ఆక్సిజెన్ స్థాయి పడిపోయింది. వెంటనే పొరపాటు గ్రహించి విమానాన్ని వెనక్కి తీసుకురావటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీనంతటికీ 23 నిమిషాలు పట్టింది. 30మంది అస్వస్థులయ్యారు. ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చినవారు కొందరైతే, కొందరికి దాంతోపాటు వినికిడి లోపం కూడా ఎదురైంది. దీన్ని గుర్తించటంలో ఇంకా ఆలస్యమై ఉంటే ముందు ఊపిరితిత్తులకు, తర్వాత మెదడుకు ఇబ్బందులు ఎదురై శాశ్వత అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బీపీ, హృద్రోగ సమస్యలున్నవారికి ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. ప్రధాన పైలెట్‌కు విమానాల్ని నడపడంలో 14 ఏళ్ల అనుభవం ఉంది. అయినా ఈ ఘటన చోటుచేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలికాలంలో ఎయిరిండియా విమానాన్ని మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయంలో నిర్దేశిత స్థలంలో కాక నిర్మాణంలో ఉన్న వేరే రన్‌వేపై దించటం వివాదాస్పదమైంది. పైలెట్ చేసిన తప్పిదం కారణంగా విమానం ప్రధాన చక్రాలు దెబ్బతిన్నాయి. అనుకోనిదేమైనా జరిగుంటే విమానంలోని 136మంది ప్రయాణికులకు ముప్పు ఏర్పడేది. ఢిల్లీ నుంచి 370మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్లిన మరో ఎయిరిండియా విమానం పదిరోజులక్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ విమానానికున్న బహువిధ వ్యవస్థలు ఒక్కసారిగా విఫలం కావటం, వాతావరణ పరిస్థితి బాగులేక పోవటం, అన్నిటికీ మించి విమానంలో ఇంధనం దాదాపు అడుగంటడం వంటివి ఒకేసారి చుట్టుము ట్టాయి. అయితే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడి అనుమతి తీసుకుని జాగ్రత్తగా కిందకు దించాడు. సుదూర ప్రాంతాలకెళ్లే విమానంలో ఇలా బహువిధ వ్యవస్థలు విఫలం కావటం అసాధారణమైన విషయం. విమానం గాల్లోకి లేచాక అందులో ఎదురయ్యే ఏ సమస్య విషయంలోనైనా విమాన సిబ్బంది వ్యవహరించే తీరు చాలా ముఖ్యమైనది. వారు ఏమాత్రం కంగారు పడినట్టు కనిపించినా, సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయినా ప్రయా ణికుల్లో ఉండే కంగారు మరింత పెరుగుతుంది. ఎఫ్ఏఏ ఆడిట్లో బయటపడిన అంశాలపై మన డీజీసీఏ శ్రద్ధ పెట్టి గట్టి చర్యలు తీసుకోవడం తప్ప నిసరి. ఆ సంస్థ నిబంధనల ప్రకారం అది ఎత్తిచూపిన లోటుపాట్లపై 30 రోజుల్లోగా నివేదిక పంపాలి. ఆ తర్వాత ఎఫ్ఏఏ ప్రతినిధి బృందం మరో నెలరోజుల్లో వచ్చి ఏ తరహా చర్యలు తీసుకు న్నదీ సమీక్షిస్తుంది. దాని ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న అభిప్రాయం కలిగితే కొత్తగా మన దేశం నుంచి వెళ్లే విమానాలను అనుమతించటం నిలిపేస్తారు. ఇప్పుడు నడుస్తున్న విమానాలకు కఠినమైన తనిఖీలు మొదలవుతాయి. పర్యవసానంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ తనిఖీలన్నీ పూర్తయి ప్రయాణికులు దిగి విమానాశ్రయ ప్రాంగణంలోకి చేరుకోవటానికి బోలెడు సమయం పడుతుంది. దాంతో ఆ దేశానికెళ్లే ప్రయాణికులు మన విమానయాన సంస్థల్ని ఎంచుకోవటం మానుకుంటారు. తరచు సమస్యలెదురవుతున్నపుడు, ఎఫ్ఏఏ, ఐఓసీఏ వంటి సంస్థలు లోపాలు ఎత్తిచూపినప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టడం అవసరం. ఈ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. -
మృత్యు తటాకం..!
దురాజ్‌పల్లి : జిల్లా కేంద్రంలో మినీట్యాంకుబండ్‌గా మారుతున్న సద్దల చెరువు (తటాకం) మృత్యుతీరంగా మారుతుందా..? ఇందుకు ఇటీవల కాలంలో జరిగిన రెండు సంఘటనలు నిజమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గస్తీలోపమో...రక్షణ లేకపోవడమో కానీ.. నిండు ప్రాణాలు చెరువులో కలిసిపోతున్నాయి. ఇటీవల పట్టణంలోని ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడమే ఇందుకు నిదర్శనం. 2018 జనవరి 26 అర్ధరాత్రిర పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన నంద్యాల శ్రీనివాస్ చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. 2017 నవంబర్ 11 అన్నాదురై నగర్‌కు చెందిన అలువాల సాయి అనే యువకుడు ప్రమాదవశాత్తు సద్దల చెరువులో జారిపడి మరణించాడు. మూడు నెలల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు.. అదీ ఒకే కాలనీకి చెందిన వారు చెరువులో ప్రాణాలొదలడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని సంవత్సరాల్లో చాలానే జరిగాయి. గతంలో కంపచెట్లతో చెరువు నిండి ఉండడంతో ప్రమాదాలను గుర్తించలేకపోయారు. కానీ.. ఇప్పుడు మినీ ట్యాంక్‌బండ్‌గా మారిన తర్వాత కూడా ప్రమాదాలను నివారించలేకపోతున్నారంటే అది గస్తీలోపమా..? లేక చెరువుకట్టపై రక్షణగోడలు లేకపోవడమా అనేది అర్థం కావడం లేదు. తూతూమంత్రంగా చర్యలు..! గత సంత్సరం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి చెరువులో శవమై తేలాడు. పట్టణంలో ఒక వ్యాపారి చెరువులో శవంగా కనపడ్డాడు. అభం శుభం తెలియని పసికందులు చెరువుల్లో శవల్లా కనిపిస్తున్న సంఘటనలు కొకోల్లాలుగా చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. ఇటు ప్రమాదాలను కానీ.. అటు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న హత్య, ఆత్మహత్య చర్యలను పోలీస్ యంత్రాంగా నివారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని కట్టపైకి వాహనాలు రాకుండా చూడాలని పట్టణ ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా.. చర్యలు మాత్రం తూతూమంత్రంగానే చేపడుతున్నారు. ముఖ్యం గా చెరువుకట్టపై మందుబాబుల ఆగడాలకు హద్దులు దాటుతున్నాయి. యువతీయువకులు పట్టపగలే చెరువుకట్టలపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇతరులు కూడా పెడదారి పట్టే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. చెరువు కట్టపై రక్షణ గోడలు ఏవీ? మినీట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దడంతో ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించడానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. పట్టణంలో ఉన్న పలు హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సెలవు దినాలలో తమ వెంట సహాయకులు ఎవరూ లేకుండా కట్టపై తిరుగుతున్నారు. దీనికి తోడు పట్టణంలో ఇరుకురోడ్ల కారణంగా కట్టపై నుంచి స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులు, ప్రయాణికులను చేరవేసే ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అయితే కట్ట పొడవునా రక్షణ లేకపోవడంతో ఇటీవలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. కట్టపై రక్షణ గోడలు లేని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసుశాఖ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు గస్తీ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రక్షణ గోడలు ఏర్పాటు చేయాలి మినీ ట్యాంక్‌బండ్‌గా సద్దుల చెరువును మార్చడం సంతోషమే కానీ.. అక్కడ ప్రజలకు రక్షణ ఉన్నట్టుగా కనబడటం లేదు. పట్టణానికి ఆనుకుని చెరువు ఉండడంతో క్షణికావేశంలో కొందరు, ప్రమాదాలతో మరికొందరు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కట్టపై రక్షణ గోడలు ఏర్పాటు చేసి.. పోలీసులు గస్తీ తిరగాలి. – కోట గోపి, సూర్యాపేట -
నిఘా నీడలో..
♦ ఓ వైపు సీఎం పర్యటన ♦ మరో వైపు పార్లమెంటేరియన్ సదస్సు ♦ దేశ విదేశీ ప్రముఖల రాక ♦ నగరంలో అసాధారణ భద్రత చర్యలు సాక్షి, విశాఖపట్నం : ప్రపంచ దేశాల ప్రతినిధు లు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు, ఉన్నతాధికారులు జిల్లాకు రానుండటంతో పోలీసు యంత్రాంగం భద్రతా వ్యవస్థను పటిష్టం చేసింది. రాష్ర్టంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ విభాగాలకు చెం దిన అధికారులు సిబ్బంది సంయుక్తంగా నగరంలో రక్షణ వలయాన్ని ఏర్పరిచారు. సీఎం ప ర్యటనతో పాటు కామన్వెల్త్ పార్లమెంటేరియన్ సదస్సు కూడా ఉండటంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నల్గొండ ఘటన తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం పోలీసు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు, కొంతమంది ఎర్ర చందనం స్మగర్లు వేర్వేరు సంఘటనల్లో చనిపోయారు. ఈఎన్కౌంటర్లతో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. దీంతో హై అలర్డ్ ప్రకటించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల ఎస్పీలు, సీపీలతో సమీక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు బుధవారం నగరానికి రానున్నారు. పలు ముఖ్య కార్యక్రమాలతో పాటు పార్లమెంటేరియన్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సాధారణంగా తీసుకునే భద్రత చర్యలతో పాటు మరింత పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ‘సాక్షి’తో అన్నారు. ఇక 10 దేశాలకు చెందిన వందలాది మంది స్పీకర్లు, ఎంపీలు, ఉన్నతాధికారులు నగరానికి వస్తుండటంతో వారి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని సీపీ తెలిపారు. సీఎం పర్యటన, విదేశీ ప్రముఖుల రాక, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా, నగర పోలీసులు గతంతో పోల్చితే అత్యంత అప్రమత్తమయ్యారు. ప్రముఖులందరూ నగరానికి వస్తుండటంతో జిల్లా ఫోర్స్‌ను కూడా నగరానికి రప్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ పరిధిలోని అధికారులను, కానిస్టేబుళ్లను నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఈ సారి తనిఖీలు నిర్వహించే పోలీసులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇచ్చారు. ప్రతి ఎస్సై, ఆపై స్థాయి అధికారులు విధిగా తుపాకీ ధరించాల్సిందేనని ఆదేశాలివ్వడంతో అందరూ ఆయుధాలు చేతపట్టారు. నాకా బందీని ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. నగరం మొత్తం సీపీ పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు.