మెడి టిప్
పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్య సమస‍్యలు కూడా అధికమవుతున్నాయి. మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్యానకి చెవి, ముక‍్కు, కంటి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. చెవి విషయానికొస్తే, చిన్న పిల‍్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ వినికిడి లోపం పెరుగుతంది. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి చెవిని కాపాడడంలో.. చేయాల్సిన జాగ్రత్తలను చూద్దాం.
చెవులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి..
- పల్లెటూళ్లలో వేసవి సెలవులు రాగానే ఈత నేర్చుకోవడం కోసం పిల్లలు నీటి కుంటలు, చెరువులకు వెళ్తుంటారు. చెరువుల్లోని మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు పరిశుభ్రమైన నీళ్లలోనే దిగాలి.
- చెవులను శుభ్రం చేయడానికి కొందరు గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం చెవుల్లో పోస్తారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు.
- అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌క్రీముల వంటివాటితో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవే ఇన్ఫెక్షన్లు చెవులకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చెవి, గొంతు, ముక్కు.. భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను మరింతగా పాటించాలి.
పై జాగ్రత్తలు పాటించాక కూడా.. గులివి, చీము వంటి సమమస్యలతో పాటు.. చెవిపోటు ఎక్కువగా వస్తున్నా, సరిగా వినిపించకపోయినా.. వీలైనంత త్వరగా
ఈఎన్‌టీ వైద్యనిపుణులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment