మెడి టిప్స్: డిస్ బయోసిస్ నివారణ
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్‌బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం.
ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది.
ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment