Medi Tips
-
మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి..
పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్యానకి చెవి, ముక్కు, కంటి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. చెవి విషయానికొస్తే, చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ వినికిడి లోపం పెరుగుతంది. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి చెవిని కాపాడడంలో.. చేయాల్సిన జాగ్రత్తలను చూద్దాం. చెవులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.. పల్లెటూళ్లలో వేసవి సెలవులు రాగానే ఈత నేర్చుకోవడం కోసం పిల్లలు నీటి కుంటలు, చెరువులకు వెళ్తుంటారు. చెరువుల్లోని మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు పరిశుభ్రమైన నీళ్లలోనే దిగాలి. చెవులను శుభ్రం చేయడానికి కొందరు గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం చెవుల్లో పోస్తారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌క్రీముల వంటివాటితో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవే ఇన్ఫెక్షన్లు చెవులకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చెవి, గొంతు, ముక్కు.. భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను మరింతగా పాటించాలి. పై జాగ్రత్తలు పాటించాక కూడా.. గులివి, చీము వంటి సమమస్యలతో పాటు.. చెవిపోటు ఎక్కువగా వస్తున్నా, సరిగా వినిపించకపోయినా.. వీలైనంత త్వరగా ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. ఇవి చదవండి: హాయి హాయిగా... కూల్ కూల్‌గా! -
మెడి టిప్స్: ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతో.. ఈ సమస్యకు చెక్!
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం. ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
కొన్ని ఆల్ఫాబెట్స్‌తో ఆస్టియోపోరోసిస్ నివారణ ఇలా!
ఆస్టియోపోరోసిస్ కేసులు భారతీయుల్లో చాలా ఎక్కువ. అందునా మహిళల్లో! యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని బట్టే మన దేశంలో దాని తీవ్రత ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన కేసులు కనిపిస్తాయి. కొన్ని ఆల్ఫాబెట్స్ సాయంతో ఆస్టియోపోరోసిస్‌ను తేలిగ్గా నివారించుకోవచ్చు. సీ, డీ, ఈ, ఎఫ్, జీ...లతో నివారణ ఎలాగంటే...? ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం అవసరమైన ప్రాథమిక అంశాలను చాలా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ,డీ,ఈ,ఎఫ్,జీ గుర్తు పెట్టుకుంటే, వాటిని బట్టి ఏంచేయాలో సులువుగా తెలుస్తుంది. ‘సి’ ఫర్ క్యాల్షియమ్ – దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – తగినంత అందేలా చూడాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’–ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – ఒకవేళ మరీ అండర్ వెయిట్ ఉంటే ఎత్తుకు తగినట్లుగా బరువు పెరగాలి. బరువు ఎక్కువ ఉంటే తగ్గాలి. -
‘ఫొటో సెన్సిటివిటీ’ ఉన్నవారికి ఎండాకాలంలో కష్టమే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
ఎండలోకి వెళ్లినప్పుడు కొందరిలో ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతుంటాయి. అప్పుడప్పుడు ఈ ఎర్రమచ్చల్లో కాస్త దురద కూడా రావచ్చు. ఎండకు ఏమాత్రం తట్టుకోలేని ‘ఫొటో సెన్సిటివిటీ’ ఉన్నవారిలో... ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా ఎర్రబారడం, ఎర్రమచ్చలు రావడాన్ని ‘సన్‌బర్న్స్’గా చెప్పవచ్చు. ఫెయిర్ స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ‘సన్‌బర్న్స్’ నివారణ కోసం కొన్ని సూచనలివే... ► బాగా ఎండలోకి వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం రాసుకోవడమే కాకుండా... బయటకు వెళ్లాక ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకోవడం రిపీట్ చేస్తుండాలి. ► అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అందులో ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. అలాగే క్యారట్, క్యాప్సికప్ (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినాలి. ► ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ఆయన సలహా మేరకు యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. ఇలా కనీసం మూడు నెలల పాటు వాడాలి. (చదవండి: అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!) ► రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. దాంతో ఈ సమస్యతో పాటు అన్నిరకాల ఆరోగ్యసమస్యల నుంచి నివారణ పొందవచ్చు. ► సమస్య తీవ్రంగా ఉన్నవారు ఆ ఎర్రమచ్చల మీద డాక్టర్ సలహా మేరకు ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పదిరోజుల పాటు రాయాలి. ► ఈ సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. (చదవండి: మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!) -
ఇది గమనించారా? మీ చిన్నారికి 20 నెలల వయసొచ్చినా మాటలు రావడం లేదా?
పిల్లలు మెల్లమెల్లగా పాకుతున్న, బుడిబుడి అడుగులు వేస్తున్న, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఆ చర్యలన్నీ వాళ్ల వికాసానికి సూచన. ఈ పనుల్ని వారు సరిగా చేయలేకపోతే వారిలో శారీరకంగా, మానసికంగా తగినంత వికాసం లేదని తెలుసుకోవచ్చు. నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా ఆరోగ్య సమస్యలు రావడం, బేబీ పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలతో నడక, మాట్లాడటం కొంత ఆలస్యం కావచ్చు. పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య బుడిబుడి అడుగులతో నడక మొదలుపెడతారు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు, చేతికి దొరికినదేదైనా పట్టుకుని లాగేయడం, వస్తువులను దూరంగా నెట్టడం, పుస్తకం చేతికిస్తే... పేజీలు తిప్పడం, క్రేయాన్స్‌తో నేలమీద, గోడలపై రాయడం, నీళ్ల టబ్ దగ్గర ఉంచితే... చేత్తో నీటి మీద తపతప తట్టడం వంటివి చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, మెట్లు ఎక్కడం చేస్తుంటారు. కొందరిలో ఈ ప్రక్రియలు కొంత ఆలస్యం కావచ్చు. (చదవండి: ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే..) ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండాక వారు... రకరకాల శబ్దాలతో పాటు ముద్దుమాటలు (బాబ్లింగ్స్) పలుకుతుంటారు. ఒకటి రెండు నిజశబ్దాలూ పలకగలరు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. అయితే 18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, శబ్దాలకు రెస్పాండ్ కాకపోతే, అలాంటి పిల్లల్లో వికాసం ఆలస్యమైందని అనుమానించాలి. అలాంటి పిల్లలను పీడియాట్రీషియన్‌కు చూపించి, వారి సూచనల మేరకు అవసరమైన తదుపరి చర్యల (ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్)తో వారిని చక్కదిద్దాలి. ఒకసారి వాళ్లలో డెవలప్మెంట్ డిలే ఉందని తెలిశాక... ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి. (చదవండి: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇలా చేస్తే..) -
కాళ్లకు వాపులు వస్తున్నాయా.. ఇది తెలుసుకోండి
కాళ్ల వాపులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు కాళ్ల వాపులు రావడం చాలామందిలో చూస్తుంటాం. ఇది చాలా సాధారణమైన, హానికరం కాని సమస్య. ఓ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. ఇక మన దేశంలోని మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. ఈ సమస్యవల్ల కాళ్ల వాపులు రావచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా కాళ్ల వాపులు వస్తుంటాయి. ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావాలతోనూ ఈ సమస్య రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారికి కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి. అంతగా ప్రమాదకరం కానివి మొదలుకొని కిడ్నీ సమస్యలూ, హార్ట్‌ఫెయిల్యూర్ వంటి సీరియస్ సమస్యల్లోనూ ఇవి వస్తుంటాయి. కాబట్టి... కాళ్లవాపులు కనిపించినప్పుడు వైద్య నిపుణుడిని సంప్రదించి కారణం ఏమిటో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించాలి. నిర్ధారణ జరిగాక, సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. (ఇది చదవండి: గుండెపోటు వస్తే కొందరిలో ఆకస్మిక మరణం ఎందుకు? కారణమేంటి?) -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్‌కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్)