ఆస్టియోపోరోసిస్ కేసులు భారతీయుల్లో చాలా ఎక్కువ. అందునా మహిళల్లో! యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని బట్టే మన దేశంలో దాని తీవ్రత ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన కేసులు కనిపిస్తాయి. కొన్ని ఆల్ఫాబెట్స్ సాయంతో ఆస్టియోపోరోసిస్‌ను తేలిగ్గా నివారించుకోవచ్చు.
సీ, డీ, ఈ, ఎఫ్, జీ...లతో నివారణ ఎలాగంటే...?
ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం అవసరమైన ప్రాథమిక అంశాలను చాలా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ,డీ,ఈ,ఎఫ్,జీ గుర్తు పెట్టుకుంటే, వాటిని బట్టి ఏంచేయాలో సులువుగా తెలుస్తుంది.
‘సి’ ఫర్ క్యాల్షియమ్ – దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.
‘డి’ ఫర్ విటమిన్ డి – తగినంత అందేలా చూడాలి.
‘ఈ’ ఫర్ ఎక్సర్‌సైజ్ – శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్‌సైజ్ చేయించాలి.
‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’–ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్‌రూమ్‌ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – ఒకవేళ మరీ అండర్ వెయిట్ ఉంటే ఎత్తుకు తగినట్లుగా బరువు పెరగాలి. బరువు ఎక్కువ ఉంటే తగ్గాలి.
కొన్ని ఆల్ఫాబెట్స్‌తో ఆస్టియోపోరోసిస్ నివారణ ఇలా!
Published Sun, Jun 25 2023 1:14 AM | Last Updated on Thu, Jul 27 2023 6:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment